Site icon HashtagU Telugu

Ponguleti : ఇందిరమ్మ ఇళ్ల పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Indiramma House

Indiramma House

Minister Ponguleti Srinivas Reddy: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు పథకం (Indiramma houses scheme)పై కీలక ప్రకటన చేశారు. ఈ పథకం ఇచ్చే విషయంలో మొదటి ప్రాధాన్యత స్థలాలు ఉన్న పేదలకు ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత విడతలో ఇంటి స్థలం అందజేస్తామని వెల్లడించారు. అందులో కూడా ఎవరి ఇళ్లు వారే నిర్మించుకుంటారని.. వారికి నిధులను నిర్దేశించిన సమయంలో విడతల వారీగా విడుదల చేస్తామని వివరించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు మంజూరు అయ్యాయి. ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500కు తగ్గకుండా ఇళ్లు ఇవ్వాలన్నదే కాంగ్రెస్​ ప్రభుత్వ లక్ష్యం. మౌళిక వసతులు లేకుండా, నిరుపయోగకరంగా ఉన్న వేలాది ఇళ్లను కూడా ఈ ఇందిరమ్మ రాజ్యంలో భేషజాలకు పోకుండా వాటికి కావాల్సిన నిధులు సైతం సమకూర్చాం. గతంలో మాదిరిగా ఇరవై, ముప్పై ఫ్లోర్​లలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అనుకోవటం లేదు. పరిమిత లెవల్​లో మాత్రమే స్థలాన్ని అనుసరించి నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు.

ధరణి సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తున్నట్లు శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడే విషయంలో అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా ఒకే విధమైన చర్యలు ఉంటాయన్నారు. హైడ్రా పనితీరును ప్రశంసించారు. జిల్లా కేంద్రాల్లో కూడా ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు ప్రకటించారు.

Read Also: Educate Your Son: కూతుర్ని కాపాడు, కానీ కొడుకుకు మంచి నేర్పు: సూర్య కుమార్ యాదవ్