Minister Ponguleti Srinivas Reddy : మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి కన్నీరు

తన నియోజకవర్గంలో యాకూబ్ అనే ఇటుకలు తయారు చేసే కూలీ కుటుంబం వరదలో కొట్టుకుపోయిందని వివరించారు

Published By: HashtagU Telugu Desk
Ponguleti Crying

Ponguleti Crying

తన నియోజకవర్గంలో వరద నీటిలో చిక్కుకున్న యాకుబ్ కుటుంబాన్ని కాపాడలేకపోయామని చెప్పి మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) కన్నీరు పెట్టుకున్నారు. భారీ వర్షాలకు ఖమ్మం నగరం అతలాకుతలంమైంది. వరద బీబత్సానికి పలు కాలనీలు జలాశయాలుగా మారిపోయాయి. కాలనీల్లోని ఇళ్లు పూర్తిగా నీటమునిగాయి. వెంకటేశ్వర నగర్ కాలనీ, గణేష్ నగర్ కాలనీ, రాజీవ్ గృహకల్ప కాలనీతోపాటు పలు పలు కాలనీలను మున్నేరు వరద నీరు పూర్తిగా మొచ్చెత్తింది. ఈ నేపథ్యంలో స్థానికులు తమను కాపాడాలంటూ వరద నీరు చుట్టుముట్టిన ఇళ్ల నుంచి బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇంటిపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నేపథ్యంలోనే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో యాకూబ్ అనే ఇటుకలు తయారు చేసే కూలీ కుటుంబం వరదలో కొట్టుకుపోయిందని వివరించారు. ఈ ఘటన వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. రెస్క్యూ టీం ఎంతో శ్రమకోర్చి వారిని కాపాడే ప్రయత్నాలు చేసిందని వివరించారు. యాకూబ్ కొడుకును మాత్రమే టీం కాపాడగలిగిందని తెలిపారు. మిగిలిన సభ్యులు కూడా రెస్క్యూ టీంకు దొరకాలని భగవంతుడిని ప్రార్థించారు. వారిని కాపాడటానికి తాను హెలికాప్టర్ కోసం కూడా ప్రయత్నించానని, కానీ, వాతావరణం సహకరించని కారణంగా ఆ ప్రయత్నం సఫలం కాలేదని తెలిపారు.

Read Also : Perni Nani : గుడివాడలో ఉద్రిక్తత.. పేర్ని నానిపై కోడి గుడ్లతో దాడి ..!

  Last Updated: 01 Sep 2024, 06:37 PM IST