అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పాత్ర గురించి బయటకు తెలియజేసారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy). తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ (TDP) దూరంగా ఉండి, కాంగ్రెస్ (Congress Party) కు మద్దతు (Support) తెలిపిన సంగతి తెలిసిందే. ఓట్లు చీల్చకూడదనే ఉద్దేశంతోనే టీడీపీ దూరంగా ఉందని చెపుతున్న..బిఆర్ఎస్ నేతలు మాత్రం తన శిష్యుడు రేవంత్ ను సీఎం చేసేందుకే పోటీ చేయలేదని..చంద్రబాబు (Chandrababu) ఆలోచనలతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ గెలువగలిగిందని బిఆర్ఎస్ (BRS) శ్రేణులు మాట్లాడుకుంటూ వచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ తరుణంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. గురువారం ఖమ్మంలో టీడీపీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరైన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు సహకరించినందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌తోపాటు టీడీపీ నేతలకు కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. గత ఎన్నికల్లో తెలంగాణలో రాజకీయంగా టీడీపీకి వచ్చే ప్రయోజనాన్ని కూడా పక్కనబెట్టి.. 119 నియోకవర్గాల్లో కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు ప్రకటించారని పేర్కొన్నారు. టీడీపీ చేసిన సాయాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ మర్చిపోదని మంత్రి స్పష్టంచేశారు.
తెలంగాణలో మార్పు కావాలని కోరుకున్న ప్రజల కోసం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) పార్టీకి టీడీపీ మద్దతు పలికిందని , టీడీపీ కృషి మరువలేనిదని, కాంగ్రెస్ గెలుపు కోసం నిద్ర పోకుండా పనిచేశారన్నారు. నియంతృత్వ, అహంకారపూరిత ప్రభుత్వాన్ని ఓడించేందుకు టీడీపీ తమతో కలిసి పనిచేసిందని, తమకు సహకరించినవారిని ఎప్పుడూ మర్చిపోనని పొంగులేటి చెప్పుకొచ్చారు. టీడీపీ, కాంగ్రెస్ రెండూ వేర్వేరు కాదని… రెండు పార్టీలు ఒకటేనని , అధికారంలో లేమని టీడీపీ నేతలు బాధపడాల్సిన అవసరంలేదని… భవిష్యత్‌లో అందరం కలిసి పనిచేద్దామని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ నేతలంతా టీడీపీ ఏజెంట్లేని తాము చేసిన ఆరోపణలు నిజమని పొంగులేటి తన మాటలతో నిరూపించారని అంటున్నారు.
Read Also : YS Sharmila : ఢిల్లీలో వరుసగా నేతలను కలుస్తున్న షర్మిల..