Site icon HashtagU Telugu

Minister Ponguleti Injured : మంత్రి పొంగులేటికి గాయం..

Minister Ponguleti Injured

Minister Ponguleti Injured

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy ) కి పెను ప్రమాదం తప్పింది. ఖమ్మం నగర సమీపంలోని మున్నేరు మహోగ్రరూపం (Munneru Vagu Water Folw Raising) దాల్చిన సంగతి తెలిసిందే. మున్నేరుపై ప్రకాశ్‌నగర్‌ వద్ద ఉన్న వంతెన పైనుంచి వరద ప్రవహించింది. వరద ఉధృతి కారణంగా ఖమ్మంలో కరుణగిరి వద్ద మున్నేరు వంతెన కంపించింది. నగరంలోని కవిరాజ్‌నగర్‌, వీడియోస్‌ కాలనీ, కోర్టు ప్రాంతం, ఖానాపురం హవేలీ, మమత హాస్పిటల్‌ రోడ్డు, కాల్వ ఒడ్డు.. దాదాపు పదుల సంఖ్యలో కాలనీల్లోని వరద నీరు పోటెత్తింది.

We’re now on WhatsApp. Click to Join.

పలు చోట్ల వరదలో చిక్కుకున్నవారు.. సాయం కోసం ఎదురు చూసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖమ్మం నగరంలోని కల్యాణ్‌నగర్‌ పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. నడుముల్లోతు నీరు చేరడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. గత 20 ఏళ్లలో ఈ స్థాయిలో వర్షం, వరద ఎప్పుడూ చూడలేదన్నారు స్థానికులు. ఇక జలదిగ్బంధంలో చిక్కుకున్న చాలామందిని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. మున్నేరు పరీవాహక ప్రాంతాలన్నింటినీ వరద ముంచెత్తింది. పలు కాలనీల్లో అనేక ఇల్లు మునిగిపోయాయి.

ఈ క్రమంలో మంత్రి పొంగులేటి స్వయంగా వరద ప్రభావిత కాలనీ కు వెళ్లి బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. నీట మునిగిన కాలనీల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బైక్‎పై తిరుగుతూ పర్యటించారు. ఈ క్రమంలో చిన్న అపశృతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మంత్రి పొంగులేటి బైక్‎పై నుండి కింద పడగా గేర్ రాడ్ కాలికి గుచ్చకోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తమై మంత్రికి చికిత్స అందించారు. మంత్రి పొంగులేటికి ఏమి కాకపోవడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. చికిత్స అనంతరం తిరిగి పొంగులేటి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మరోపక్క కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి..రోడ్డు మార్గాన ఖమ్మం కు చేరుకోబోతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు.

Read Also : KTR : నిజామాబాద్‌ కాలేజీ హాస్టల్‌ విద్యార్థిని మృతిపై విచారణ జరిపించాలి