Mallareddy : నేడు ఐటీ విచారణకు హాజరుకానున్న మంత్రి మల్లా రెడ్డి..!

  • Written By:
  • Updated On - November 28, 2022 / 11:27 AM IST

ఐటీ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు తాము ఇవాళ విచారణకు హాజరవుతున్నట్లు మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కేవలం విచారణకు హాజరుకావాలని మాత్రమే ఐటీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిపారు. ఎలాంటి పత్రాలు, బ్యాంక్ లావాదేవీలు అవసరమని సూచించలేదని చెప్పారు. ఐటీ అధికారులకు తాము పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. తమ ఇంట్లో దొరికిన నగదు గురించి పూర్తి వివరాలు ఐటీ అధికారులకు తెలియజేస్తామన్నారు.

మంత్రి మల్లారెడ్డితోపాటు మరో 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు పంపించారు. ఇప్పటికే రెండు రోజులపాటు మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలు, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీల్లో తనిఖీలు చేసారు అధికారులు. మంత్రి మల్లారెడ్డితోపాటు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బంధువులు రఘునాథరెడ్డి, త్రిశూల్ రెడ్డి, సోదరులు వేణుగోపాల్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో 15కోట్ల నగదుతోపాటు పలు కీలక పత్రానలు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, పన్ను ఎగవేత, మేనేజ్ మెంట్ కోటా కింద సీట్ల అమ్మకాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు విచారించనున్నారు.