Minister Malla Reddy : చిరంజీవి కంటే నేనే ఫేమస్ – మంత్రి మల్లారెడ్డి

నేను ఈ డైలాగ్ ను ఎక్కడి నుంచో తీసుకురాలేదని తన వృత్తి గురించి చెబుతుంటే ఫేమస్ అయిపోయిందని అన్నారు

Published By: HashtagU Telugu Desk
Mallareddy

Mallareddy

మంత్రి మల్లారెడ్డి (Minister Malla Reddy) ఈయన గురించి ప్రత్యేకంగా..కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం మీడియా లో , సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉంటారు. ఆయన ఏంచేసినా..ఏమాట్లాడిన..ఏ కామెంట్స్ చేసిన అది క్షణాల్లో వైరల్ కావాల్సిందే. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం (Election Campaign)లో బిజీ గా ఉన్న మల్లారెడ్డి..ఓ న్యూస్ ఛానల్ ప్రోగ్రాం లో పాల్గొని అనేక విషయాలు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

1980 నుంచి 1990 మధ్య కాలంలో పాల వ్యాపారం చేసానని , 1990 నుంచి 2000 వరకూ బోర్ వెల్స్ నడిపించానని , 2000 తరువాత పూల వ్యాపారం చేసి, స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆ తరువాత మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించి కష్టపడి ఈ స్థాయికి ఎదిగానన్నారు. తాను చెప్పే పాలమ్మినా, పూలమ్మినా అని చెప్పే డైలాగ్ తన జీవితకాలం కష్టం చెప్పుకొచ్చారు. నేను ఈ డైలాగ్ ను ఎక్కడి నుంచో తీసుకురాలేదని తన వృత్తి గురించి చెబుతుంటే ఫేమస్ అయిపోయిందని అన్నారు. ఈరోజుల్లో ఎక్కడ చూసిన నా వీడియోలే దర్శనం ఇస్తున్నాయని.. నేను తుమ్మినా తుఫాన్ అయిపోతుందని సరదాగా చెప్పుకొచ్చారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కన్నా తానే ఫేమస్ అని కీలక వ్యాఖ్యలు చేశారు మల్లారెడ్డి. ఈ పేరు ఎందుకొస్తోంది అని ప్రశ్నించుకున్నారు. తాను ఒక కవి, నటుడు, సెలబ్రిటీ కాదని సింపుల్ మ్యాన్ అని, లో ప్రొఫైల్, హై థింకింగ్ అంటూ నవ్వులు పూయించారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి ఆయన్ను వార్తల్లో నిలిచేలా చేస్తున్నాయి.

Read Also : Modi Panauti: రాహుల్ కు ఈసీ షాక్.. నోటీసులు జారీ

  Last Updated: 23 Nov 2023, 06:48 PM IST