Malla Reddy Controversy: మరో వివాదంలో మల్లారెడ్డి.. జర్నలిస్టులతో మంత్రి గొడవ

కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సిహెచ్‌ మల్లా రెడ్డి నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటారు. అతని స్టేట్మెంట్స్, డైలాగ్స్, వర్క్స్ అతన్ని

Published By: HashtagU Telugu Desk
Mallareddy

Mallareddy

కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సిహెచ్‌ మల్లా రెడ్డి నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటారు. అతని స్టేట్మెంట్స్, డైలాగ్స్, వర్క్స్ అతన్ని సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారుస్తాయి. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి తీరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఉప ఎన్నికల ప్రచారం అనంతరం శుక్రవారం చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామంలో మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. వివిధ కుల సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. మీడియా సమావేశాన్ని వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. అయితే మల్లారెడ్డి ఆగ్రహానికి గురై ఓ రిపోర్టర్ ఫోన్ లాక్కెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. అంతటితో ఆగకుండా మీడియా ప్రతినిధులను తిట్టారు. అయితే మంత్రి మల్లారెడ్డి అనుచరుల ప్రవర్తనపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి మీడియాలో నిలిచారు మల్లారెడ్డి.

గత కొంతకాలంగా మంత్రి వివాదాల్లో కూరుకుపోతున్నారు. ఇటీవల మంత్రి మద్యం బాటిల్ పట్టుకుని దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై మల్లారెడ్డి స్పందిస్తూ.. మద్యం సేవించడంలో తప్పేముంది? నేను నా బంధువుల పార్టీకి హాజరై మద్యం సేవించాను.
మరోవైపు రిపోర్టర్‌ను చాలా మంది సమక్షంలోనే ఫోన్ లాక్కుని అవమానించారని జర్నలిస్టు సంఘాలు మంత్రిపై మండిపడ్డారు. మల్లారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

  Last Updated: 14 Oct 2022, 03:09 PM IST