Site icon HashtagU Telugu

KTR’s WhatsApp: కేటీఆర్ కు షాక్.. నిలిచిపోయిన వాట్సాప్!

Ktr

Ktr

కాలికి గాయమై ప్రగతి భవన్ లో విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు పార్టీ నాయకులు, సెలబ్రిటీలు, ప్రముఖులు వరుసపెట్టి వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టారు. అలా ఒకేరోజు 8,000 మెసేజ్‌లు వచ్చాయి. స్పామ్స్ కు గురైనట్టు భావించిన నేపథ్యంలో ఆయన వాట్సాప్ నిలిచిపోయింది. “నిన్నటి నుండి మూడుసార్లు నా @WhatsApp నిలిచిపోయింది. ఎందుకంటే 8 వేలకు పైగా సందేశాలు వచ్చాయి! వీలైనన్ని ఎక్కువ సందేశాలకు ప్రతిస్పందించడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఇప్పుడు అది గత 24 గంటలుగా అందుబాటులో లేకుండా పోయింది’’ అంటూ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు కేటీఆర్. అయితే కేటీఆర్ ప్రగతి భవన్ కు పరిమితమైనా.. వ్యక్తిగత పనులు, తన శాఖకు సంబంధించిన పనులను క్లియర్ చేస్తున్నారు.