Site icon HashtagU Telugu

KTR: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు…మాపై దర్యాప్తు సంస్థలను వేట కుక్కల్లా ప్రయోగిస్తారు..!!

Ktr Imresizer

Ktr Imresizer

తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమపై ED, CBI, IT సంస్థలను వేట కుక్కల్లా ప్రయోగించే అవకాశం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. అన్నింటికీ తాము రెడీగా ఉన్నామని తెలిపారు కేటీఆర్. శుక్రవారం మీడియాతో చిట్ చాట్ చేశారు కేటీఆర్. BRSను ఏర్పాటు చేసినందుకు తమపై కేంద్రం, కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ వీడుతున్నట్లు చెప్పారు. ప్రధానప్రతిపక్షంగా కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందన్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. కేరళలో రాహుల్ యాత్ర చేస్తుంటే…గోవాలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పక్క పార్టీలోకి వెళ్లారన్నారు.

దేశంలో రాజకీయ శూన్యత ఉందన్న కేటీఆర్…తమ పార్టీపేరు మార్చుకున్నామన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఎదుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అటు కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. వాళ్ల కుటుంబానికి చెందిన సుశీ ఇన్ ఫ్రా కంపెనీ 22వేల కోట్ల కాంట్రాక్టు తీసుకుందని తెలిపారు. మహారాష్ట్ర , కర్నాటక, రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Exit mobile version