Site icon HashtagU Telugu

KTR : మునుగోడులో భారీ మెజార్టీతో గెలుస్తాం..!!

Ktr Imresizer

Ktr Imresizer

మునుగోడు ఉపఎన్నిక మోసగాళ్లకు, మొనగాళ్లకు మధ్య జరుగుతున్న పోటీ అన్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. మంగళవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ ఉపఎన్నికలో ప్రజాస్వామ్యం గెలవాల్సిన అవసరం ఉందన్న కేటీఆర్….ప్రజలకు బీజేపీ సర్కార్ అన్యాయం చేసిందని విమర్శించారు. మునుగోడులో ఏం చేశాము..రానున్న రోజుల్లో ఏం చేస్తామో ప్రజలకు వివరించుకుంటూ ప్రచారం నిర్వహించామన్నారు. కానీ బీజేపీకి చెప్పుకునేందుకు ఏమీ లేదన్నారు. నల్లగొండ జిల్లాలో ఏళ్ల తరబడి వేధిస్తున్న ఫ్లోరిసిస్ మహమ్మారిని కట్టడి చేసింది మా ప్రభుత్వమే అని కేటీఆర్ తెలిపారు. మతం పేరుతో చిచ్చులు పెట్టి రాజకీయాలు చేయడం బీజేపి అలవాటు అన్నారు. నీళ్లు ఇచ్చిన పార్టీకి..కన్నీళ్లు తెప్పించిన పార్టీకి మధ్య జరుగుతున్న పోరు అని అన్నారు కేటీఆర్.

మునుగోడులో ఓడిపోతామన్న భయం బీజేపీకి పట్టుకుందన్నారు. అందుకే టీఎన్జీవో నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. పలివేలలో తమ పార్టీకి చేందిన నేతలపై దాడులు చేశారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా, ప్రజల శ్రేయస్సు ఆశించే పార్టీకి ఓటేయ్యాలని కోరారు.