Site icon HashtagU Telugu

KTR: సిరిసిల్ల రైతులతో కేటీఆర్

ktr

New Web Story Copy (72)

KTR: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందివచ్చిన పంట నీటమునిగింది. తమ బాధను పట్టించుకునేవారే లేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. నష్టపోయిన రైతులతో మాట్లాడి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల్ని పరామర్శించిన మంత్రి అనంతరం జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోయారన్నారు. నష్టపోయిన పంట పొలాలను ముఖ్యమంత్రి కెసిఆర్, నేను పరిశీలించామని అన్నారు. వడగండ్ల వాన కారణంగా వరి ధాన్యం తడిచి ముద్దయింది.నష్టపోయిన రైతులందరిని తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. తెలంగాణాలో నీళ్ల కొరత లేనందున రైతన్నలు వరి విస్తారంగా సాగైంది. బీఆర్ఎస్ అంటే రైతు ప్రభుత్వం అని నొక్కి చెప్పారు. కాగా సిరిసిల్ల జిల్లాలో 13 మండలాల్లో 19 వేల ఎకరాలలో పంట నష్టం జరిగిందని కేటీఆర్ అన్నారు.కాగా.. సివిల్ సప్లై ద్వారా 7 1/2 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి కేటీఆర్. .

ఈ సమావేశంలో కేటీఆర్ ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళా ప్రధాని కర్ణాటకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేటీఆర్ మోడీ కర్ణాటక టూర్ ని టార్గెట్ చేశారు. కర్ణాటక బీజేపీ మేనిఫెస్టోలో మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తామని చెప్పారు. నరేంద్రమోడీ దేశాని ప్రధానినా ? లేక కర్నాటక రాష్ట్రానికి ప్రధానమంత్రా..? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

Read More: ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ లో టీమిండియా టాప్, ఆస్ట్రేలియా వెనక్కి!