Site icon HashtagU Telugu

Congress : మొండిచేయికి ఓటేస్తే 3 గంట‌ల క‌రెంట్ గ్యారెంటీ, ఏడాదికో సీఎం – కేటీఆర్

BRS Public Meeting at SPL

BRS Public Meeting at SPL

150 ఏండ్ల కింద పుట్టిన పార్టీ (Congress).. ఆ పార్టీ వారెంటీ ఎప్పుడో అయిపోయింది. చ‌చ్చిన పీనుగ‌లాంటి పార్టీ. ఆ పార్టీకే వారెంటీ లేదు.. మ‌రి ఆ పార్టీ నాయ‌కుల మాట‌ల‌కు గ్యారెంటీ ఉందా..? మొండిచేయికి ఓటేస్తే 3 గంట‌క‌ల క‌రెంట్ గ్యారెంటీ అంటూ మరోసారి కాంగ్రెస్ ఫై నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్ (Minister KTR).

శనివారం ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో పర్యటించారు. ఖమ్మం, వైరా, భద్రాచలం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసారు. ఈ సందర్బంగా సత్తుపల్లి (Sathupalli) లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఫై..రీసెంట్ గా బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరిన తుమ్మల , పొంగులేటి లపై పరోక్షంగా విమర్శలు చేసారు. రాజ‌కీయాల్లో పార్టీలు మార‌డం స‌హ‌జం. నిన్న‌టి దాకా కేసీఆర్ దేవుడు అని పొగిడిన‌వారే.. ఇవాళ దుర్మార్గుడు అని పేర్కొన‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు..? అని ప్రశ్నించారు.

కేసీఆర్ 2 వేల పెన్ష‌న్ ఇస్తే.. డ‌బుల్ ఇస్తామ‌ని , 24 గంట‌ల క‌రెంట్ ఇస్తే 48 గంట‌ల క‌రెంట్ ఇస్తామ‌ని. 6 గ్యారెంటీ పధకాలు (Congress 6 Guarantee Schemes) అని కొత్త కొత్త డైలాగులు చెబుతూ ప్రజలను మోసం చేయాలనీ చూస్తున్నారని కాంగ్రెస్ ఫై మండిపడ్డారు. 150 ఏళ్ల కింద పుట్టిన పార్టీ.. ఆ పార్టీ వారెంటీ ఎప్పుడో అయిపోయింది. చ‌చ్చిన పీనుగ‌లాంటి పార్టీ. ఆ పార్టీకే వారెంటీ లేదు.. మ‌రి ఆ పార్టీ నాయ‌కుల మాట‌ల‌కు గ్యారెంటీ ఉందా? ఆలోచించండి. హైద‌రాబాద్‌లో క‌మాండ్, బెంగ‌ళూరులో న్యూక‌మాండ్, ఢిల్లీలో హైక‌మాండ్ ఉంది. ఒక‌టి మాట ఒక‌రు విన‌రు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు, ఆస‌రా పెన్ష‌న్లు అమ‌లు చేస్తున్నారా? ఎందుకు తెలంగాణ మీద ప్రేమ పొంగిపొర్లుతోంది. 200 పెన్ష‌న్లు ఇచ్చినోడు.. ఇప్పుడు 4 వేలు ఇస్తామంటే న‌మ్ముదామా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

కాంగ్రెస్‌ను న‌మ్మితే కుక్క తోక‌ప‌ట్టి గోదారి ఈదిన‌ట్టే. ఆలోచించండి ఒక్క‌సారి. ఆగం కావొద్దు. ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కులు వ‌స్తారు. కండువాలు మారుతాయి. ఊద‌ర‌గొట్టే ఉప‌న్యాసాలు చేస్తారు. ఆరు ద‌శాబ్దాలు ప‌ట్టించుకోనోళ్లు.. ఆరు గ్యారెంటీలు అంటే న‌మ్ముదామా..? అని ప్రశ్నించారు. స‌త్తుప‌ల్లి చైత‌న్య‌వంత‌మైన ప్రాంతం..వ్య‌వ‌సాయ ఆధారిత నియోజ‌క‌వ‌ర్గం ఇది. చైత‌న్య‌వంత‌మైన రైతులు ఉన్నారు. సీతారామ ప్రాజెక్టు 90 శాతం పూర్త‌యింది. మిగ‌తా 10 శాతం త్వ‌ర‌లోనే పూర్తి కానుంది. రాబోయే సంవ‌త్స‌ర కాలంలో 2 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీళ్లు రాబోతున్నాయి అని కేటీఆర్ అన్నారు. అలాగే సభ కు వచ్చిన ప్రజలను చూసి..ఈ జ‌నాన్ని చూస్తుంటే వీర‌య్య గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసారు. ఓవరాల్ గా కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన సక్సెస్ ఫుల్ గా సాగడం తో బిఆర్ఎస్ నేతలు , శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : AP : చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరీ ఫై ఏపీ సర్కార్ వేటు..