Telangana Politics: ఎంఐఎం, బీజేపీపై మంత్రి కేటీఆర్ కౌంటర్

తెలంగాణాలో బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మద్య దోస్తీ తెలిసిందే. జీహెచ్ఎంసీ ఎలెక్షన్స్ లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. మద్దతు కావాల్సిన సమయంలో ఎంఐఎం బీఆర్ఎస్ వెంట ఉంటుంది.

Telangana Politics: తెలంగాణాలో బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మద్య దోస్తీ తెలిసిందే. జీహెచ్ఎంసీ ఎలెక్షన్స్ లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. మద్దతు కావాల్సిన సమయంలో ఎంఐఎం బీఆర్ఎస్ వెంట ఉంటుంది. అయితే తాజాగా ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరిగినట్టుగా తెలుస్తుంది. ఈ మధ్య ఇరు పార్టీలు విమర్శలు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికల కోసం పార్టీలు సిద్ధమవుతున్న తరుణంలో, ఎంఐఎం తన రాజకీయ ఉనికిని విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో ఎంఐఎం ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.ఇదిలా ఉండగా మంత్రి కేటీఆర్ ఎంఐఎం, బీజేపీ పార్టీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ రోజు గురువారం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణాలో బీజేపీ ఉనికి కోల్పోయిందని చెప్పారు మంత్రి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో బీఆర్ఎస్ 90 నుంచి 100 సీట్లు గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. అలాగే మంత్రి మాట్లాడుతూ అమిత్ షాపై విరుచుకుపడ్డారు. మణిపూర్ లో అల్లర్లు చెలరేగుతున్న సమయంలో అమిత్ షా కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. దేశం అన్ని రంగాల్లో వెనుకబడటానికి బీజేపీ ప్రభుత్వమే కారణమంటూ దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల సమయానికి బీజేపీ పరిస్థితి మరింత దిగజారుతుందని, తెలంగాణాలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు కేటీఆర్.

మంత్రి కేటీఆర్ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీపై విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. కేటీఆర్ మాట్లాడుతూ అసదుద్దీన్ తెలంగాణాలో బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని, అయితే ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ విధానాలు బాగున్నాయని చెప్తున్నారని కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలంగాణాలో ఎంఐఎం, బీఆర్ఎస్ ఒకటేనని చెప్పుకుంటున్నా.. అంతర్గతంగా ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఇక తెలంగాణాలో ఎంఐఎం పూర్తిస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంఐఎంపై విమర్శలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

Read More: Jagan cinema : వెండితెర‌పై జగ‌న్‌ తాండ‌వం, `ఫైబ‌ర్ నెట్ ` లో కొత్త సినిమాల‌ రిలీజ్‌