Site icon HashtagU Telugu

Minister KTR Serious : సొంత పార్టీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన మంత్రి కేటీఆర్‌.. ఈసారి అత‌న్ని ప‌క్క‌న పెట్టిన‌ట్లేనా?

Minister Ktr

Minister Ktr

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ (Minister KTR) కు కోప‌మొచ్చింది. సొంత పార్టీ ఎమ్మెల్యే షేక్ హ్యాడ్ ఇస్తుంటే అస‌హ‌నంతో ఎమ్మెల్యే చేతిని తోసిప‌డేశారు. ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్‌ (Mahabubabad) లో కేటీఆర్ ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియా (Social media) లో వైర‌ల్ అవుతోంది. దీంతో.. మంత్రి కేటీఆర్ కు అస‌లు కోపం ఎందుకొచ్చిందా అనే ప్ర‌శ్న స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వ‌కుండా స‌ద‌రు ఎమ్మెల్యేను బీఆర్ఎస్ పార్టీ ప‌క్క‌న పెట్టిన‌ట్లేనా అనే చ‌ర్చకూడా సాగుతోంది. వివ‌రాల్లోకి వెళితే..

మంత్రి కేటీఆర్ శుక్ర‌వారం మ‌హ‌బూబాబాద్‌లో ప‌ర్య‌టించారు. గిరిజ‌నుల‌కు పోడు భూముల ప‌ట్టాల‌ను పంపిణీ చేశారు. అంత‌కు ముందు కేటీఆర్ డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌ను ప్రారంభించేందుకు వెళ్లారు. ఈ క్ర‌మంలో కేటీఆర్ కారు దిగి డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల‌ను ప్రారంభించేందుకు వెళ్తున్న క్ర‌మంలో మ‌హబూబాబాద్ ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ (MLA Shankar Nayak) క‌ర‌చాల‌నం చేసే ప్ర‌య‌త్నం చేశాడు. శంక‌ర్ నాయ‌క్ వైపు ఆగ్ర‌హంతో చూసిన కేటీఆర్‌.. ఎమ్మెల్యే చేతిని తోసిప‌డేశారు. కేటీఆర్ తీరుతో ఒక్క‌సారిగా షాక్‌గురైన శంక‌ర్ నాయ‌క్ రెండు చేతులు జోడించి దండం పెట్టారు. అయినా కేటీఆర్ ప‌ట్టించుకోలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

అనంత‌రం గిరిజ‌నుల‌కు పోడు భూముల‌ ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మంలోనూ మంత్రి కేటీఆర్ శంక‌ర్ నాయ‌క్ పేరును ప్ర‌స్తావించ‌లేదు. దీంతో కేటీఆర్ తీరుపై మ‌హ‌బూబాద్ బీఆర్ ఎస్‌లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతుంది. అయితే, కేటీఆర్ కోపానికి కార‌ణ‌ముంద‌ని కొంద‌రు బీఆర్ ఎస్ నేత‌లు పేర్కొంటున్నారు. మంత్రి కారు దిగి వ‌స్తున్న స‌మ‌యంలో కొంద‌రు స్థానిక ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు దిగారు. కేటీఆర్ ను అడ్డుకొనే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో కేటీఆర్ కు స్థానిక ఎమ్మెల్యేపై కోపం వ‌చ్చింద‌ని పేర్కొంటున్నారు.

మ‌రికొంద‌రు బీఆర్ ఎస్ నేత‌లు మాత్రం ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ పార్టీలో వ్య‌వ‌హ‌రిస్తున్న విధానంతోనే కేటీఆర్ అలా చేసి ఉంటార‌ని పేర్కొంటున్నారు. శంక‌ర్ నాయ‌క్ అంటే వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అని కొంద‌రు బీఆర్ ఎస్ నేత‌లే పేర్కొంటున్నారు. సొంత పార్టీ నేత‌ల‌తోనూ ఎప్పుడూ విబేధాలు ఉండ‌టంతో శంక‌ర్ నాయ‌క్ పై కేటీఆర్ కొంత‌కాలంగా ఆగ్ర‌హంతో ఉన్నార‌ని, ఆ కోపాన్ని ఇలా ప్ర‌ద‌ర్శించార‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం కేటీఆర్ తీరు చూస్తుంటే వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో శంక‌ర్ నాయ‌క్‌కు బీఆర్ ఎస్ టికెట్ ద‌క్కే అవ‌కాశం లేద‌న్న వాద‌న‌ను కొంద‌రు బీఆర్ఎస్ నేత‌లు చ‌ర్చించుకోవ‌టం గ‌మ‌నార్హం.

Congress : ఖమ్మం “జ‌న‌గ‌ర్జ‌న” సభపై భారీ అంచనాలు… రంగంలోకి దిగిన రాహుల్ టీమ్‌