Site icon HashtagU Telugu

Minister KTR : చంద్రబాబు అరెస్టుపై స్పందించిన మంత్రి కేటీఆర్

Ktr

Ktr

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్ట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. చంద్ర‌బాబు అరెస్ట్ అయితే తెలంగాణ‌కు ఏం సంబంధం ఉంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు అరెస్ట్ ఏపీకి చెందిన రాజ‌కీయ స‌మ‌స్య అని.. అక్క‌డ అరెస్ట్ అయితే ఇక్క‌డ నిర‌స‌లు తెలియ‌జేయ‌డ‌మేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఐటీ ఉద్యోగులు, టీడీపీ నేత‌లు హైదరాబాద్ లో ఆందోళనలు చేయ‌డంపై మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. ఆంధ్రాలో పంచాయితీ.. ఆంధ్రాలో తేల్చుకోవాలని.. హైదరాబాద్ వాసులును టీడీపీ, వైసీపీ ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. వైసీపీ, టీడీపీకి తెలంగాణలో ప్రాతినిధ్యం లేదని.. తెలంగాణలో అన్ని ప్రాంతాల వారు కలిసిమెలిసి ఉంటున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ వేళ కూడా ఐటీ సెక్టార్ లో ఆందోళనలు జరగలేదన్నారు. త‌మ పార్టీ నేతలు స్పందిస్తే అది వారి వ్యక్తిగత అభిప్రాయమ‌న్నారు. తాము తటస్థంగా ఉంటున్నా .. ఆందోళనలకు ఎందుకు అనుమతివ్వడం లేదని త‌న‌కు నారా లోకేశ్ ఫోన్ చేశారని .. ఒకరికి అనుమతిస్తే.. వేరే పార్టీకి అనుమతి ఇవ్వాల్సివస్తుందని లోకేష్‌కి తెలిపిన‌ట్లు కేటీఆర్ తెలిపారు. ఏపీ పంచాయితీలకు తెలంగాణను వేదిక కానివ్వమ‌ని..చంద్రబాబు అరెస్టు రెండు పార్టీల సమస్య మాత్ర‌మేన‌న్నారు. లోకేశ్, జగన్ ఇద్దరూ త‌న‌కు మిత్రులేన‌ని..ఏపీ ప్రజలు ఇక్కడ బాగానే ఉన్నారని తెలిపారు.