KTR reaction on Chandrababu Arrest : బిజెపి మద్దతుతోనే చంద్రబాబు అరెస్టు – కేటీఆర్ కామెంట్స్

బిజెపి మద్దతుతోనే చంద్రబాబు అరెస్టు జరిగిందని దేశమంతా అనుకుంటుందని కామెంట్స్ చేశారు. ఈ వయసులో చంద్రబాబును అరెస్టు చేయడం సరికాదని తమ పార్టీకి చెందిన నేతలు సానుభూతి వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు

Published By: HashtagU Telugu Desk
Andhra Settlers Votes

Andhra Settlers Votes

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో పెట్టిన సంగతి తెలిసిందే. గత 37 రోజులుగా బాబు జైల్లోనే ఉన్నారు. ఇక చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ (TDP) శ్రేణులు ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ప్రతి రోజు వివిధ కార్యక్రమాలతో తమ నిరసన ను తెలుపుతున్నారు. ఇటు తెలంగాణ లో కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు కు మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో పలు రాజకీయ పార్టీలు ఆంధ్ర ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు చంద్రబాబు అరెస్ట్ ను వాడుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మొదటగా చంద్రబాబు అరెస్ట్ ఫై పెద్దగా స్పందించని బిఆర్ఎస్ (BRS) ఆ తర్వాత చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ వస్తున్నారు. మంత్రులు తలసాని (Talasani) , హరీష్ రావు (Harish Rao), కేటీఆర్ (KTR) లాంటి సీనియర్ నేతలే కాకుండా చాలామంది బాబు అరెస్ట్ ను తప్పుబట్టారు. తాజాగా కేటీఆర్ మాట్లాడుతూ.. బిజెపి మద్దతుతోనే చంద్రబాబు అరెస్టు జరిగిందని దేశమంతా అనుకుంటుందని కామెంట్స్ చేశారు. ఈ వయసులో చంద్రబాబును అరెస్టు చేయడం సరికాదని తమ పార్టీకి చెందిన నేతలు సానుభూతి వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. టిడిపి నేతలు ఏపీలో రాజకీయం పోరాటం చేస్తున్నారని.. ఇదే సమయంలో ఎంతమందితో గొడవ పెట్టుకుంటారని కేటీఆర్ ప్రశ్నించారు. తమపై సానుభూతితో ఉన్నవారిని వదిలేసుకుంటారా అని వ్యాఖ్యానించారు. తమకు తెలుగుదేశం పార్టీలోని పలువురితో సత్సంబంధాలు ఉన్నాయని.. జగన్, పవన్, లోకేష్ లతో మంచి సంబంధాలే కొనసాగుతున్నాయని వివరించారు. అంతకు ముందు కూడా చంద్రబాబు ఆరోగ్యం ఫై లోకేష్ చేసిన ట్విట్ పై స్పందించారు కేటీఆర్. తన బాధను వ్యక్తం చేస్తూ.. లోకేష్ కు సానుభూతి తెలిపారు.

Read Also : BRS Minister: మంత్రి గంగుల వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు

  Last Updated: 16 Oct 2023, 02:41 PM IST