Site icon HashtagU Telugu

Hyderabad: మెట్రో రైల్ విస్తరణపై కేటీఆర్ సమీక్ష

Hyderabad

New Web Story Copy 2023 08 10t205817.755

Hyderabad: హైదరాబాద్ మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్ పై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నత స్థాయి సమావేశం జరిపారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు శాఖాధిపతులు హాజరయ్యారు. ఈ సమీక్షలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ భవిష్యత్తు కోసం భారీగా మెట్రో విస్తరణ అవసరమని చెప్పారు. నగరంలో రద్దీ మరియు కాలుష్యం తగ్గేలా మెట్రో విస్తరణ జరపాల్సిన అవసరం ఉందని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ ని విశ్వ నగరంగా మార్చాలి అంటే ముందుగా ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం కావాలని సూచించారు. ఈ మేరకు మెట్రోని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తున్నందున దానికి సంబంధించిన పనులు వేగంగా జరగాలని అధికారుల్ని ఆదేశించారు. అందులో భాగంగా ఎయిర్ పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ వే పై మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఇందుకోసం అవసరమైన 48 ఎకరాల భూమిని మెట్రో డిపో కోసం అప్పగించాలని జిఎంఆర్ వర్గాలకి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన భూమిని వెంటనే మెట్రో వర్గాలకి అందించాలని, మెట్రో విస్తరణ ప్రణాళికల పైన ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మంత్రి కేటీఆర్ కోరారు. లక్డికాపూల్ నుంచి బిహెచ్ఇఎల్, ఎల్బీనగర్ నుంచి నాగోల్ వరకు మెట్రోకీ సంబంధించిన విషయాలపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలని దీనికి గానూ తొమ్మిది వేల ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కేటీఆర్ తెలిపారు. మెట్రో రైలు సంబంధిత అధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశం ముగిసిన తరువాత అక్బరుద్దీన్ ఒవైసీతో సమావేశం అయ్యారు. వీరిద్దరి మధ్య పాతబస్తీ మెట్రో పనులపై చర్చ జరిగింది.

Also Read: Nagula Chaviti: నాగుల చవితి రోజు పుట్టకు పాలు పోయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?