Bangalore Floods : వరదల్లో చిక్కుకున్న బెంగుళూరుకు మంత్రి కేటీఆర్ పాఠాలు.!!

కర్నాటక రాజధాని బెంగళూరును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రహదారులన్నీ జలమయంగా మారాయి.

Published By: HashtagU Telugu Desk
Ktr Imresizer

Ktr Imresizer

కర్నాటక రాజధాని బెంగళూరును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రహదారులన్నీ జలమయంగా మారాయి. చాలా ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకోగా..మరికొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి, కార్యాలయాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఈ భారీ వర్షాల వల్ల ఐటీ కారిడార్ లోని తమ కంపెనీలు రూ. 225కోట్లు నష్టపోయినట్లు బెంగుళూరు ఔటర్ రింగ్ రోడ్డు కంపెనీస్ అసోసియేషన్, ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైకి లేఖ రాసింది. దీనిపై స్పందించారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ .

మన నగరాలే దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపిస్తుంటాయి. అలాంటి నగరాల్లో మౌలిక వసతుల కల్పన బాగుండాలి. నాణ్యమైన రోడ్లు, గాలి, నీరు కల్పించడం పెద్ద కష్టం కాదు. దానికి అవసరమైన మూలధనాన్ని కేంద్ర హౌసింగ్ , అర్భన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ చూసుకోవాలి. పట్టణ ప్రణాళిక పాలనతో మనకు సంస్కరణలు అనేవి చాలా అవసరం. నేను చెప్పే మాటలు హైదరాబాదీలకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే గతంలో ఇలాంటి పరిస్థితి హైదరాబాద్ కు వచ్చినప్పుడు కొందరు బెంగుళూరు నేతలు విమర్శించారు. కానీ ఒక దేశంగా ఎదగాలంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.

  Last Updated: 05 Sep 2022, 08:43 PM IST