KTR In Paris : ప్యారిస్‌లో కేటీఆర్ స్పీచ్‌కు విశేష స్పంద‌న‌

ప్రపంచ యవనికపై తెలంగాణ కీర్తి పతాకం సగర్వంగా ఎగిరింది. ఫ్రెంచ్ సెనేట్ లో తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసానికి స్థానిక వాణిజ్య, రాజకీయ ప్రముఖుల నుండి విశేష స్పందన లభించింది. కేటీఆర్ ప్రసంగానికి సభికులు కరతాళధ్వనులు చేశారు.

  • Written By:
  • Publish Date - October 30, 2021 / 07:00 PM IST

ప్రపంచ యవనికపై తెలంగాణ కీర్తి పతాకం సగర్వంగా ఎగిరింది. ఫ్రెంచ్ సెనేట్ లో తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసానికి స్థానిక వాణిజ్య, రాజకీయ ప్రముఖుల నుండి విశేష స్పందన లభించింది. కేటీఆర్ ప్రసంగానికి సభికులు కరతాళధ్వనులు చేశారు. పారిస్‌లోని ఫ్రెంచ్ సెనేట్‌లో జరిగిన ‘యాంబిషన్ ఇండియా 2021’ బిజినెస్ ఫోరమ్‌లో మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు. ప్రతిష్టాత్మక కాన్ఫరెన్స్ లో “కోవిడ్ అనంతర కాలంలో ఇండో-ఫ్రెంచ్ సంబంధాల భవిష్యత్తును రూపొందించడం” అనే అంశం మీద మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.

 

గత ఏడేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తున్న తీరును వివరిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలకు మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ విధానాలు కేంద్ర ప్రభుత్వ పరిధి అయితే, భారత సమాఖ్య నిర్మాణంలో, రాష్ట్రాలు కూడా భూమి కేటాయింపు, ఆమోదం మరియు అనుమతులు అందించడం, శిక్షణ పొందిన మానవ వనరులను పొందడంలో కంపెనీలకు సహాయం చేయడం, వనరుల సేకరణ విధానాలు వంటి బహుళ కార్యాచరణ అంశాల్లో గణనీయమైన స్వయంప్రతిపత్తిని పెంపొందించుకుంటున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.