Site icon HashtagU Telugu

KTR: వాళ్లిద్దరూ పర్లేదు కానీ..ఇప్పుడు ఈ బఫూన్ గాళ్లతో మాట్లాడాల్సి వస్తోంది..!!

Ktr Imresizer

Ktr Imresizer

మునుగోడు ఉపఎన్నిక ఒక కాంట్రాక్టర్ అహంకారం వల్లే వచ్చిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో జరిగిన TRSVవిస్త్రుతస్థాయి సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. బీజేపీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మోదీ, అమిత్ షా అప్పనంగా కట్టబెట్టిన కాంట్రాక్టులపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోజుకో విధంగా మాట్లాడుతున్నారని వాటిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజగోపాల్ రెడ్డికి కేంద్రం 18వేల కోట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టిందని ఆరోపించారు. నల్లగొండ డెవలప్ మెంట్ కు ఆ 18వేల కోట్లు ఇస్తే ఉపఎన్నిక నుంచి తప్పుకుంటామన్నారు. జగదీశ్ రెడ్డి మాటలకు తాను కట్టుబడి ఉంటానన్నారు కేటీఆర్.

ఇంతకుముందు ఉన్న ప్రత్యర్థులే మంచిగుండే. చంద్రబాబు, వైఎస్సార్ వాళ్లతోని కోట్లాడిన గమ్మత్తుగా ఉండేది. వాళ్లు ఒకస్థాయి నాయకులు. ఇప్పుడు ఈ బఫూన్ గాళ్లతో మాట్లాడాల్సి వస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఈ బఫూన్ గాళ్లంత ఎక్కడున్నారని ప్రశ్నించారు. నిజాయితీగా ఉండేవాళ్లకు భయం ఎందుకని ప్రశ్నించారు. చస్తాం కానీ బీజేపీ పై పోరాటంలో వెనక్కిపోయే ప్రసక్తే లేదన్నారు.