Site icon HashtagU Telugu

KTR : మతాల పేరుతో కొట్టుకోమని ఏ దేవుడు చెప్పాడు…!!!

Ktr Imresizer

Ktr Imresizer

తెలంగాణలో ఈ మధ్య కాలంలో చోటుచేసుకున్న పరిణామాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మతాల పేరుతో జరుగుతున్న గొడవలపై కేటీఆర్ స్పందించారు. మతాల పేరు చెప్పుకొని కొట్టకోమని ఏ దేవుడు చెప్పాడంటూ ప్రశ్నించారు. నీళ్లు, తిండి అల్లాడుతుంటే…వాటి పరిష్కారం వదిలేసి అనవసర విషయాలపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.

ఎనిమిదేండ్ల పాలనలో తెలంగాణలో ఏం సాధించారని విపక్షాలు వాస్తవం తెలుసుకోవాలన్నారు . ఎనిమిదేండ్ల స్వల్పం కాలంలోనే నీటిపారుదల రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. రాష్ట్రం ఉజ్వల స్థితికి చేరిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నీటిపారుదల రంగంలో ఐఏఎస్ లకే పాఠాలు చెప్పే స్థాయికి తెలంగాణ ఎదిగిందని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

 

Exit mobile version