Site icon HashtagU Telugu

Minister Koppula: ప్రజా ఆశీర్వాద యాత్రకు మంత్రి కొప్పుల శ్రీకారం!

Koppula Eshwar Imresizer

Koppula Eshwar Imresizer

Minister Koppula: తెలంగాణలో రానున్న ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధం అయింది. ధర్మపురి అభివృద్ధి ప్రధాత, రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గం జగదేవ్ పేట నుంచి ప్రజా ఆశీర్వాద యాత్రకు శ్రీకారం చుట్టారు. గత కొన్ని నెలలుగా నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాడుతూ పర్యటిస్తూ వస్తున్న ఈశ్వర్.. ఇవాళ ప్రజా ఆశీర్వాద యాత్ర మొదలు పెట్టారు ఒక వైపు వర్షం పడుతున్న అభిమానులు ప్రజా ఆశీర్వాద యాత్రకు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.

బీఆరెఎస్ ఎన్నికల ప్రచార రధం పై నుంచి ఈశ్వర్ అభివాదం చేస్తూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. దారి పొడవునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. మంత్రి వెంట యాత్రలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి స్నేహలత.. పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read: Asia Cup 2023: ఆసియా కప్ జరగడం కష్టమేనా?