తెలంగాణ సీఎం (Telangaan CM ) గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..తన మార్క్ చూపిస్తున్నాడు. గత ప్రభుత్వం లోపాలను సరిచేస్తూ..సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల మెప్పుపొందుతున్నారు. అధికారంలోకి వచ్చి రాగానే ప్రగతి భవన్ ను కాస్త మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ (Mahatma Jyotiba Phule Praja Bhavan) గా మర్చి వార్తల్లో నిలిచారు. అలాగే ప్రజావాణి (Prajavani) పేరిట ప్రతి మంగళవారం , శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుండి పిర్యాదులు స్వీకరించేలా ఏర్పాట్లు చేసారు. ఈ రెండు రోజులు మంత్రులు కార్యక్రమంలో పాల్గొని ప్రజల వినతులను తీసుకొంటారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ నెల 08 న సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమం చేపట్టగా ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. ప్రజలు పెద్ద ఎత్తున తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజాభవన్ కు తరలివస్తున్నారు. ఈరోజు మంగళవారం నిర్వహించిన ప్రజావాణి(Prajavani)కి అనూహ్య స్పందన లభించిందని రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) అన్నారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుని, వారి అర్జీలను తీసుకున్నారు. ప్రతి అర్జీకి ఒక నంబర్‌ను కేటాయిస్తున్నట్లు తెలిపారు. అలాగే అర్జిదారుల రిఫరెన్స్ కోసం వారి సెల్ ఫోన్ నంబర్‌కు మెసేజ్ పంపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజావాణి నిర్వహణను జలమండలి ఎండీ దాన కిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ముషారఫ్ అలీ, ఆయుష్ డైరెక్టర్ హరిచందన, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ దొత్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Also : 2024 Holidays List : 2024లో ప్రభుత్వ సెలవులు ఎన్ని వచ్చాయో తెలుసా..?