KCR vs Komatireddy: కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నవ్: కోమటిరెడ్డి

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 31న తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. సాగునీటి కొరతతో ఎండిపోతున్న పంటలను పరిశీలించి, కరువుతో అల్లాడుతున్న రైతులను పరామర్శించి వారిని ఓదార్చనున్నారు

KCR vs Komatireddy: బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 31న తెలంగాణలోని మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. సాగునీటి కొరతతో ఎండిపోతున్న పంటలను పరిశీలించి, కరువుతో అల్లాడుతున్న రైతులను పరామర్శించి వారిని ఓదార్చనున్నారు. ఆయన పర్యటనలో జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లా రైతుల్ని కలిసి, వారి బాధల్ని విననున్నారు.

కేసీఆర్ నల్గొండ పర్యటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు వచ్చిందన్నారు కోమటిరెడ్డి. కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నాడు.. నల్లగొండ జిల్లాలో పర్యటించడానికి కేసీఆర్‌కు సిగ్గుండాలి అంటూ ధ్వజమెత్తారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అంతకుముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల వల్లే రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

We’re now on WhatsApp : Click to Join

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తమ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న నేపథ్యంలో జిల్లా పర్యటనకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ నాయకుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి కె. కేశవరావు తన కుమార్తె, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గద్వాల్‌తో కలిసి కాంగ్రెస్‌లో తిరిగి చేరాలని నిర్ణయించుకోవడంతో బిఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది. వరంగల్ లోక్‌సభ స్థానానికి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకున్న మరో సీనియర్‌ బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్‌ నేతలను కలిశారు. వారిని పార్టీలోకి ఆహ్వానించారు. దీనిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని కడియం శ్రీహరి తెలిపారు.

Also Read: Voice Clone : ఇక వాయిస్‌ క్లోన్ ఈజీ.. OpenAI కొత్త ఆవిష్కరణ