Site icon HashtagU Telugu

BRS Office Demolition: నల్గొండలో బీఆర్ఎస్ కార్యాలయం కూల్చివేత

BRS Office Demolition

BRS Office Demolition

BRS Office Demolition: 100 కోట్ల ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించారని నల్గొండలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని తెలంగాణ రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. బీఆర్‌ఎస్ ఆఫీస్ని నెలరోజుల క్రితమే కూల్చివేయాలని ఆదేశించానని అయితే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వును ఇంకా ఎందుకు పాటించలేదని సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.నిబంధనలను ఎందుకు ఉల్లంఘిస్తున్నారని కోమటి రెడ్డి మున్సిపల్ కమిషనర్‌ను ప్రశ్నించారు.

పేదవాడి ఇల్లు అయితే కూల్చివేత త్వరగా జరిగి ఉండేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దానికి మున్సిపల్ కమీషనర్ సమాధానమిస్తూ రెండు నెలల క్రితమె నోటీసులు పంపామని చెప్పారు. కాగా నేను రెండు కాదు పది నోటీసులు ఇస్తాను అంటూ అధికారులపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కూల్చివేత ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని నల్గొండ మున్సిపల్ కమిషనర్‌ను కోమటి రెడ్డి ఆదేశించారు. అతి త్వరలో హాస్టల్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే పనులను పర్యవేక్షించాలని నల్గొండ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డిని ఆదేశించారు.

Also Read: Medigadda Barrage : ఇంతకాలం కాంగ్రెస్ చేసింది.. విష ప్రచారమని తేలిపోయింది – కేటీఆర్