Minister Jupally Krishna Rao: శనివారం మహబూబ్ నగర్‌లో భారీ ఎత్తున రైతు పండగ సభ విజయవంతమైందని, పాలమూరు ప్రజల తరుపున సీఎంకు ధన్యవాదాలు అని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) పేర్కొన్నారు. మూడు రోజుల పాటు రైతు పండగ సభలో వేలాదిగా రైతులు పాల్గొని వ్యవసాయ ఆధారిత అదునాతన సాంకేతిక పరికరాలను పరిశీలించారని మంత్రి తెలిపారు. నా రాజకీయ చరిత్రలో ఇంత పెద్ద వ్యవసాయానికి సంబంధించిన స్టాల్స్.. టెక్నాలజీ మీద రైతులకు అవగాహన కల్పించి కార్యక్రమం ఏర్పాటు చేశారని అన్నారు. సాంకేతిక సమస్యతో పెండింగ్‌లో ఉన్న రుణమాఫీని రూ. 2,750 కోట్లు విడుదల చేయడం జరిగిందని వివరించారు.
70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు సీఎం అయ్యే అవకాశం వచ్చిందని, బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేదని మంత్రి విమర్శించారు. సీఎం పెద్ద మనసుతో పాలమూరు వలసల జిల్లా కు క్యాబినెట్ మంత్రుల సమక్షంలో ఏడాదికి రూ. 20 వేల కోట్లు ఇవ్వమని రేవంత్ రెడ్డి కోరారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని గుర్తుచేశారు. అప్పులు చేసి పోవడమే కాక.. రూ. 40వేల కోట్ల బకాయిలు పెట్టారని మంత్రి తెలిపారు. ఏడాదికి రూ. 800 కోట్ల ఆదాయం వచ్చే అక్షయ పాత్ర లాంటి రింగు రోడ్డును అప్పనంగా అమ్ముకున్నారని మండిపడ్డారు. రింగురోడ్డు 35ఏళ్లకు 7వేల కోట్లకు అమ్మారని తెలిపారు.
Also Read: Tritiya Jewellers : హీరోయిన్స్‌కే కుచ్చుటోపీ పెట్టిన మోసగాడు.. కటాకటాల వెనక్కి కాంతిదత్
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ కేవలం 25 శాతం మందికి మాత్రమే చేశారని మంత్రి తెలిపారు. రేషన్ షాపులో 6 రూపాయలకు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు దళారులు 16 రూపాయలకు కేజీ అమ్ముకున్నారని ఫైర్ అయ్యారు. అప్పు చేసింది నిజం కాదా వడ్డీ కట్టేది నిజం కాదా .. ఎవడు వస్తాడో ఎల్బీ స్టేడియంలో చర్చకు రండి.. కేటీఆర్, హరీష్ రావు వస్తారా అని సవాల్ విసిరారు. ఎంత గొప్పగా పద్యాలు, స్పీచ్‌లు ఇచ్చామనేది కాదు.. పారదర్శకమైన పాలన చేయడం గొప్పతనం అని అన్నారు.
గొప్ప ఉద్యమకారుడిని అని చెప్పుకొనే నిరంజన్ రెడ్డి 2001-2018 వరకు ఒక్కసారి కూడా ఎందుకు గెలువలేదు. కేసీఆర్ రైట్ హ్యాండ్ నిరంజన్ రెడ్డి దొంగ ఉద్యమం చేశాడు. ప్రజలు సమయం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెట్టారని అన్నారు. అవగాహన రహిత్యంగా ఛార్జ్ షీట్ విడుదల చేయవద్దని, ఒక్క సంవత్సరంలో ఏం తెలుస్తుంది. మాకు ఇంకా సమయం ఉంది.. ఐదు ఏళ్ల పరిపాలన చూసి ఛార్జ్ షీట్ విడుదల చేస్తే బాగుంటుందని మంత్రి తెలిపారు. పూర్వ పరాలు పరిశీలించి ఛార్జ్ షీట్ రిలీజ్ చేయాలని, రైతు పండగ చూసి కేటీఆర్, హరీష్ రావులకు నిద్ర పట్టలేదని ఎద్దేవా చేశారు.
పదేళ్లలో గొప్ప పాలన చేస్తే పది లక్షల కోట్ల అప్పులు ఎందుకు అయ్యాయి? నెలకు ఆరు వేల కోట్ల రూపాయలు వడ్డీలు కట్టాల్సి వస్తుంది. గత పాలనలో మంత్రులకు ప్రగతి భవన్ లోకి ఆహ్వానం లేదు. సెక్రటేరియట్ లోకి ఎమ్మెల్యేలకు అనుమతి లేదు. ప్రతిపక్ష పార్టీల గాడిలో ప్రజలు పడకుండా ఉండాలి. కాంగ్రెస్ పాలన దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ఆయన అన్నారు.