మంత్రి హరీశ్ రావును …గవర్నర్ తమిళసై రాజ్ భవన్ కు పిలిచే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎందుకంటే…తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన కొన్ని బిల్లులు ప్రస్తుతం గవర్నర్ వద్దే పెండింగ్ లో ఉన్నాయి. ఈ క్రమంలోనే వైద్య సిబ్బంది పదవీ విరమణ వయస్సు పెంపు కు సంబంధించిన బిల్లు గురించి వివరణ కోరేందుకు మంత్రి హరీశ్ రావును గవర్నర్ రాజ్ భవన్ కు పిలిచే అవకాశం ఉందని సమాచారం.
దీనికి సంబంధించిన రాజ్ భవన్ నుంచి సీఎంఓకు లేఖ పంపినట్లతే దానికి సంబంధించిన మంత్రి హరీశ్ రావు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. హెచ్ ఓడీలకు సంబంధించి వయోపరిమితి పెండమనేది ప్రధాన ఆందోళనగా సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పటికే గవర్నర్ కు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గవర్నర్ తీరును టీఆర్ఎస్ తీవ్రంగా విమర్శిస్తోంది. బిల్లులను కావాలనే గవర్నర్ పెండింగ్ పెడుతున్నారన్న ఆరోపణలు టీఆర్ఎస్ చేస్తోంది. అయితే అధికారపార్టీ ఆరోపణలు గవర్నర్ ఖండించారు. పెండింగ్ లో ఉన్న బిల్లుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యతనకు ఉందంటూ ఈ మధ్యే రాజ్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో గవర్నర్ తెలిపారు.
అంతకుముందు యూనివర్సిటీ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లు గురించి చర్చించేందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రాజ్ భవన్ కు పిలిపించిన సంగతి తెలిసిందే.