Site icon HashtagU Telugu

Minister Harish Rao : ఎల్లారెడ్డిలో 100 ప‌డ‌క‌ల ఆసుప‌త్రికి శంకుస్థాప‌న చేసిన మంత్రి హ‌రీష్ రావు

Harish Rao

Harish Rao

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో వంద పడకల ఆసుపత్రికి ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌రీష్‌రావు శంకుస్థాప‌న చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ దేశానికే ఆదర్శప్రాయమైన మోడల్‌గా నిలిపి, ఆరోగ్య సంరక్షణ రంగంలో తెలంగాణ సాధించిన ‘అద్భుతమైన ప్రగతి గురించి మంత్రి హ‌రీష్ రావు ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. తెలంగాణలో ప్రాథమిక ఆరోగ్య నిబంధనల నుండి అధునాతన సూపర్ స్పెషాలిటీ సౌకర్యాల‌ను క‌ల్పించామ‌న్నారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయ‌ని.. రాష్ట్రవ్యాప్తంగా డయాలసిస్ రోగులకు సౌక‌ర్యాల‌ను క‌ల్పించామ‌న్నారు. అంతేకాకుండా డయాలసిస్ రోగులకు ప్రభుత్వం ఉచిత బస్ పాస్‌లు, పెన్షన్‌లను అందింస్తుంని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాల నిష్పత్తిలో గణనీయమైన పెరుగుదల ఉందని, ఇప్పుడు 63 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రస్తుతం ఉన్న కేసీఆర్‌ కిట్‌తో పాటు గర్భిణుల కోసం ప్రత్యేకంగా కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతోందని మంత్రి హ‌రీష్ రావు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో కొత్త మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్లు హ‌రీష్ రావు ప్రకటించారు, ప్రస్తుత సంవత్సరంలోనే కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఆయ‌న వెల్ల‌డించారు.