Harish Rao : `రేష‌న్ పై బొమ్మ‌` ఇష్యూలో నిర్మ‌ల‌కు హ‌రీశ్ కౌంట‌ర్‌

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య `ఫ్లెక్సీ` ర‌చ్చ రేగింది. రేష‌న్ షాపు వ‌ద్ద `మోడీ ఫ్లెక్సీ` పెట్ట‌లేద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లాసీతామ‌న్ కామారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ జితేష్ పాటిల్ కు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు.

  • Written By:
  • Updated On - September 2, 2022 / 04:31 PM IST

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య `ఫ్లెక్సీ` ర‌చ్చ రేగింది. రేష‌న్ షాపు వ‌ద్ద `మోడీ ఫ్లెక్సీ` పెట్ట‌లేద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లాసీతామ‌న్ కామారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ జితేష్ పాటిల్ కు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. రేష‌న్ బియ్యం స‌ర‌ఫ‌రాలో కేంద్రం వాటా గురించి క‌లెక్ట‌ర్ చెప్ప‌లేక‌పోవ‌డంతో ఆమె మ‌రింత ఆగ్ర‌హించారు. అర‌గంట‌లో కేంద్రం వాటా ఎంతో వివ‌రంగా చెప్పాల‌ని హుకుం జారీ చేశారు. అంతేకాదు, మోడీ ప్లెక్సీని సాయంత్రంలోపు రేష‌న్ దుకాణం వ‌ద్ద పెట్టాల‌ని డెడ్ లైన్ పెట్టారు. దీంతో ఆ స‌న్నివేశం సోష‌ల్ మీడియా వేదిక‌గా వైర‌ల్ అయింది.

ప్ర‌తిగా తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు రంగంలోకి దిగారు. దేశాన్ని సాకుతోన్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒక‌ట‌ని నిర్మ‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. సుమారు రూ. 3.65ల‌క్ష‌ల కోట్ల‌ను దేశానికి తెలంగాణ ఇస్తోంద‌ని లెక్క తీశారు. అందుకే, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కేసీఆర్ ఫ్లెక్సీల‌ను పెట్టాల‌ని కేంద్ర మంత్రి నిర్మ‌ల‌కు హిత‌వు ప‌లికారు. దీంతో రేష‌న్ బియ్యంలో ఫ్లెక్సీల ప్ర‌చారం రాజ‌కీయాన్ని సంత‌రించుకుంది. రేష‌న్ షాపుల వ‌ద్ద మోడీ ఫ్లెక్సీని పెట్ట‌మ‌న‌డం ఆయ‌న్ను త‌గ్గించ‌డ‌మేన‌ని మంత్రి హ‌రీశ్ అన్నారు. అంతేకాదు, దేశ వ్యాప్తంగా కేసీఆర్ ప్లెక్సీలు పెడితే, తెలంగాణ‌లో మోడీ ఫోటోల‌ను రేష‌న్ షాపుల వ‌ద్ద పెడ‌తామ‌ని కౌంటర్ ఇచ్చారు హరీశ్ రావు.

పేదలకు పంపిణీ చేసే బియ్యం కోసం కేంద్రం 30 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 4 రూపాయలు జ‌త‌చేస్తోంది. అందుకే, మోడీ ఫోటోల‌ను రేష‌న్ షాపుల వ‌ద్ద పెట్టాల‌ని నిర్మ‌ల డిమాండ్ చేశారు. అంతకుముందు బాన్సువాడలో నిర్మలా సీతారామన్ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. పోలీసులు రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.

మొత్తం మీద కేంద్ర మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ తెలంగాణ ప‌ర్య‌ట‌న రాజ‌కీయ రాద్ధాంతం దిశ‌గా వెళుతోంది. ప్ర‌చారం కోసం టీఆర్ఎస్, బీజేపీ పోటీప‌డ‌డంతో మ‌రోసారి రాజ‌కీయ ర‌చ్చ మొద‌లైయింది.