Harish Rao : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్…రైతు బంధుపై కీలక ప్రకటన..!!

తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది టీఆరెస్ సర్కార్. రైతు బంధుపై మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. రైతు బంధుపై ఏర్పాట్లు చేస్తున్నామని...త్వరలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయన్నారు.

Published By: HashtagU Telugu Desk
Harish Rao

Harish Rao

తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది టీఆరెస్ సర్కార్. రైతు బంధుపై మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. రైతు బంధుపై ఏర్పాట్లు చేస్తున్నామని…త్వరలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ లో 35కోట్లతో వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మాణానికి స్థానిక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి భూమిలో పూజలో పాల్గొన్నారు హరీశ్ రావు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. భీంగల్ ప్రజల్లో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలాంటి ఉత్సాహం ఉండేదో ఇప్పుడూ అలాంటే ఉత్సాహమే కనిపిస్తొందన్నారు. భీంగల్ ప్రజల ప్రేమకు, అభిమానానికి నేనెప్పుడూ విధేయుడిని అన్నారు. ఉద్యమంలో కష్టపడి కొట్లాడిన గడ్డకు 100పడకల ఆసుపత్రి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పై మండిపడ్డారు. 8నెలల్లో హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేసి అన్ని రకాల వైద్య సేవలు అందిస్తామని మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా చెప్పారు.

  Last Updated: 19 Jun 2022, 09:17 AM IST