Site icon HashtagU Telugu

TS Government: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ప్రభుత్వం లక్ష సహాయం.. ఇలా అప్లై చేసుకోండి?

Ts Government

Ts Government

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతుల కోసం అలాగే విద్యార్థుల కోసం కులవృతులు చేసుకునే వారి కోసం అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం మరో కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనుంది. అదేంటంటే.. సామాజికవర్గంలోని కులవృత్తులు, చేతివృత్తులు చేసే వారికి రూ. ఒక లక్ష సహయం చేసే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 9వ తేదీన ప్రారంభించనుంది. మంచిర్యాల జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

బీసీ వృత్తులు, చేతి వృత్తులవారికి లక్ష నగదు ఆర్ధిక సహాయం అందించనుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ ఒక లక్ష ఆర్ధిక సహాయం కోస ధరఖాస్తు చేసుకునేందుకు కూడా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైట్ ను ప్రారంభించింది. https://tsobmmsbc.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం పైన ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి మీ ఫోటో, ఆధార్, కుల ధృవీకరణ పత్రంతో పాటు మొత్తం 33 కాలమ్స్ అప్లికేషన్స్ ను నింపాలి.

ఈ ధరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించనుంది. దళిత బంధు తరహలోనే బీసీల కోసం ఒక పథకాన్ని ప్రకటించనున్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు. అయితే ప్రస్తుతం వృత్తులు చేసుకొనేవారికి రూ. లక్ష నగదును ఆర్ధిక సహాయం అందించనుంది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి వెంటనే కులవృత్తులు చేతివృత్తులు చేసుకునేవారు ఈ లక్ష నగదు ఆర్థిక సహాయానికి వెంటనే అప్లై చేసుకోండి.

Exit mobile version