రేషన్ కార్డు ఈకేవైసీ (Ration Card E-KYC) విషయంలో తెలంగాణ ప్రజలు గందరగోళం అవుతున్నారు. బోగస్ రేషన్ కార్డులు ఏరివేసే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రేషన్ ఈకేవైసీ కార్యక్రమం గత కొద్దీ రోజులుగా జోరుగా సాగుతోంది. రేషన్ షాప్స్ తో పాటు మీ సేవ లలో ఈకేవైసీ చేయించుకుంటున్నారు ప్రజలు. అయితే ఈ ఈకేవైసీ ఏ రోజు వరకు చేసుకోవాలి..ఎప్పుడు లాస్ట్ డేట్ అనేది క్లారిటీ లేకపోయే సరికి మనిషికో మాట చెపుతూ రేషన్ దారులను అయోమయానికి గురి చేస్తున్నారు. ఈరోజే లాస్ట్ డేట్ కావొచ్చు అంటూ ప్రతి రోజు పెద్ద ఎత్తున ప్రజలు రేషన్ షాప్స్ కు క్యూ కడుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటి వరకు రేషన్ కార్డు (Ration Card ) ఉన్న సభ్యుల్లో ఎవరో ఒకరు వచ్చి థంబ్ వేస్తే బియ్యం తీసుకెళ్లేవారు. అయితే చాలా మంది ఇంటి సభ్యుల్లో ఎవరైనా చనిపోయినా వారి పేరు రేషన్ తీసుకుంటున్నారు.ప్రస్తుతం రేషన్ కార్డులో పేరున్న ప్రతి సభ్యుటు రేషన్ షాప్ కు వెళ్లి వేలి ముద్ర వేసి కేవైసీ చేయించుకోవాలి. రేషన్ డీలర్లు ఈ పాస్ మిషన్లో ఈ వేలి ముద్రలు తీసుకుంటున్నారు. రేషన్ షాపు (Ration Shop)కు వెళ్లి రేషన్ కార్డు నంబర్ చెప్పాలి. ఆ తర్వాత వేలి ముద్ర వేసినప్పుడు వారి వారి ఆధార్ కార్డు నంబర్ తో పాటు రేషన్ కార్డు నంబర్ కనిపిస్తుంది. ఆ తర్వాత గ్రీన్ లైట్ వస్తే మీరు కేవైసీ విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు అవుతోంది. ఒకవేళ రెడ్ లైట్ వస్తే మీ ఆధార్ రేషన్ కార్డు తో సరిపోలేదని అర్థం అప్పుడు రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలి. కేవైసీ చేసుకోకుంటే బియ్యం రావని తెలియడంతో చాలా మంది రేషన్ షాపుల ముందు బారులు తీరుతున్నారు.
కాగా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వార్తలపై , కేవైసీ డెడ్ లైన్ పై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) క్లారిటీ ఇచ్చారు. కేవైసీ చేయించుకోకుంటే రేషన్ కార్డులో పేరు తొలగిస్తారనేది పూర్తిగా అవాస్తవమని ఇది కేవలం దుష్ప్రచారమేనన్నారు. దీనిపై జరుగుతును్న తప్పుడు ప్రచారాన్ని వినియోగదారులు నమ్మకూడదని అధికారులు చెబుతున్నారు. ఈ కేవైసీ చేసుకునేందుకు చివరి తేదీ అంటూ ఏమీ లేదని మంత్రి చెప్పారు. కేవైసీకి ఇంకా చాలా సమయం ఉందని…ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.
Read Also : Telangana : ఈ నెల 6న బిజెపి అభ్యర్థుల జాబితా విడుదల..?