Warangal Politics: వరంగల్ టీఆర్ఎస్ కు షాక్.. బీజేపిలోకి ఎర్రబెల్లి సోదరుడు?

పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు,

Published By: HashtagU Telugu Desk
Errabelli

Errabelli

పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు, టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ప్రదీప్ రావు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కలిశారని, వరంగల్ తూర్పు పార్టీ నేతలతో కూడా ఫోన్‌లో మాట్లాడారని వర్గాలు చెబుతున్నాయి. ‘అన్న బీజేపీలో చేరుతున్నాడు’ అని బీజేపీ పార్టీ నేతలు ధృవీకరించడం, అతని అనుచరుల వాట్సాప్ సందేశాలు ఫార్వర్డ్ చేయడంతో చేరిక లాంఛనప్రాయమని తెలుస్తోంది.

రౌడీలు, పోకిరీలు, భూ కబ్జాదారులకు తప్ప తనలాంటి నాయకులకు గుర్తింపు లేదని ఎర్రబెల్లి ప్రదీప్ రావు వాపోయారు. సీనియర్ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ఆగస్టు 7న పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ప్రదీప్ రావు ఆగస్టు 7న ఢిల్లీలో అమిత్ షాను కలవబోతున్నారని.. అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ప్రదీప్ రాజీనామా అధికార టీఆర్‌ఎస్‌కు పెద్ద దెబ్బ లాంటిదే. ఇప్పటికే వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కన్నెబోయిన రాజయ్య కూడా టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం పెద్ద లోటు అని చెప్పక తప్పదు.

  Last Updated: 03 Aug 2022, 12:48 PM IST