Site icon HashtagU Telugu

Bhatti : సామాన్యుడిలా బస్సులో ప్రయాణించిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి

Minister Bhatti Travel By R

Minister Bhatti Travel By R

తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Minister Bhatti) సామాన్యుల వలే ఆర్టీసీ బసులో ప్రయాణం చేసి ప్రయాణికులను ఆశ్చర్య పరిచారు. బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన..ఈ సందర్భంగా ఖమ్మం నుండి బోనకల్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసారు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉచిత బస్సు జర్నీ స్కీమ్ అమలుపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత ప్రయాణం స్కీమ్ పట్ల మహిళలు చాలా సంతోషంగా ఉన్నారని , ఉచిత బస్సు ప్రయాణానికి ఎంతైనా ఖర్చు పెడతామని స్పష్టం చేశారు. TGఆర్టీసీ ఇప్పుడు లాభాల్లోనే ఉందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో వైరా శాసనసభ్యులు రామదాసు నాయక్, జిల్లా కలెక్టర్ గౌతమ్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఈ స్కీమ్‌ను అమలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం విజయవంతంగా అమలు అవుతోంది.

Read Also : Relationship Tips : విడాకుల వైపు వెళ్లకుండ వైవాహిక జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి.?