Hyderabad: హైదరాబాద్ పై చలి పంజా, వణుకుతున్న సిటీ జనం!

హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో నగర ప్రజలు వణికిపోయారు.

Published By: HashtagU Telugu Desk
Winter

Winter

Hyderabad: శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో నగరమంతా వణుకు పుట్టింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ మార్క్ కంటే తక్కువగా పడిపోవడంతో నగరం మంచు దుప్పటి కప్పుకుంది. సగటు కనిష్ట ఉష్ణోగ్రత చలి 13.6 డిగ్రీల సెల్సియస్ గా ఉన్నాయి.  ముఖ్యంగా సంవత్సరంలో ఈ సమయంలో ఊహించిన సాధారణ మార్క్ 15.2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంది.

తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సంగారెడ్డిలోని కోహీర్‌లో 8.9 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో రెండు రోజుల్లో తుపానుగా మారే అవకాశం ఉంది. రాజేంద్రనగర్‌లో 11.5 డిగ్రీల సెల్సియస్, మౌలాలీలో 11.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ప్రభావిత ఇతర ప్రాంతాల్లో గచ్చిబౌలిలో 12.7 డిగ్రీల సెల్సియస్, కుత్బుల్లాపూర్‌లో 13.1 డిగ్రీల సెల్సియస్, వెస్ట్ మారేడ్‌పల్లి మరియు బండ్లగూడలో ఒక్కొక్కటి 13.6 డిగ్రీల సెల్సియస్, హయత్‌నగర్‌లో 14 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ సీజన్‌లో చాలా వరకు కనీస ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

హైదరాబాద్‌లో వచ్చే మూడు రోజుల పాటు తెల్లవారుజామున పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత రోజులో పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) సూచనలను జారీ చేసింది. సగటు కనిష్ట ఉష్ణోగ్రత 16, 18 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని తెలిపింది.

Also Read: Medaram Jatara: మేడారం జాతర ఏర్పాట్లపై జాప్యం, శాశ్వాత వసతులకు నో ఛాన్స్

  Last Updated: 15 Dec 2023, 03:47 PM IST