Site icon HashtagU Telugu

Mindspace Buildings Demolition : మాదాపూర్ మైండ్ స్పేస్ లో క్షణాల్లో రెండు భారీ భవనాలు కూల్చివేత..ఎందుకంటే..!

Mindspace Buildings Demolition

Mindspace Buildings Demolition

మాదాపూర్ మైండ్ స్పేస్ (Mindspace) లో రెండు భారీ భవనాలను (Two Huge Buildings) కేవలం 10 సెకన్లలో అత్యాధునిక పద్దతిలో కూల్చేశారు. ఇటీవలే ఈ భవనాల నిర్మాణం చేపట్టగా సాంకేతిక సమస్యలు రావడంతో.. ఈ రెండు భవనాలను కూల్చేయాలని యాజమాన్యం (Owners ) భావించింది. శనివారం పనులు మొదలుపెట్టింది. ఎడిపిక్ ఇంజినీరింగ్ సంస్థ భవనాల కూల్చివేత బాధ్యతలు తీసుకుంది. కేవలం 10 సెకన్లలో ఈ రెండు భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. పేలుడు పదార్థాలను జాగ్రత్తగా వాడి, అన్ని చర్యలు తీసుకుని రెండు బిల్డింగ్స్ ను సెక్షన్ల వ్యవధిలో కూల్చివేశారు.

Read Also : Prabhas Salaar : రెబల్ ఫ్యాన్స్ కు షాక్.. సలార్ 6 నెలలు వెనక్కి..!

కూల్చివేత ప్రక్రియ కు ముందే కొన్ని రోజుల నుంచే అందులోని కార్యాలయాలను ఖాళీ చేయించారు. ఆపై రెండు బిల్డింగ్స్ కూల్చివేతకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వీకెండ్స్ కావడం, ఐటీ ఉద్యోగుల తాకిడి లేకపోవడంతో తక్కువ జన సంచారం ఉంటుందని శనివారం ఈ భారీ భవనాలను కూల్చివేశారు. అయితే రెండు భవనాలను కూల్చివేయడంతో చుట్టు పక్కల ప్రాంతం అంతా దుమ్ము ధూళి వ్యాపించడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. మరికొన్ని రోజుల్లో పెద్ద బిల్డింగ్స్ కట్టాలని ఓనర్లు ప్లాన్ చేసినట్టు సమాచారం.