Site icon HashtagU Telugu

MIM Voice change : కారుకు ఓవైసీ ప్ర‌మాదం! కాంగ్రెస్ తో పొత్తు దిశ‌గా గ‌ళం.!!

Asaruddin's master plan

Mim Voice Change

`స్టీరింగ్ నా చేతిలోనే ఉందంటున్నారు.. యాక్సిండెంట్ చేస్తానేమో..`. అంటూ ఎంఐఎం చీఫ్ ఓవైసీ చేసిన సంచ‌ల‌న (MIM Voice change)  కామెంట్ తెలంగాణ రాజ‌కీయాల‌ను మ‌లుపుతిప్ప‌నుంది. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత కేసీఆర్, ఓవైసీ (OYC)స‌హ‌జ‌మిత్ర‌త్వాన్ని కొన‌సాగిస్తున్నారు. వాళ్లిద్ద‌రి పార్టీలు ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణిలో వెళుతున్నాయి. మ‌జ్లిస్ పార్టీకి ఇస్తోన్న ప్రాధాన్యం కేసీఆర్ ఇత‌ర విప‌క్షాలు ఇవ్వ‌రు. పాత‌బ‌స్తీ కేంద్రంగా ఎన్ని అర‌చ‌కాలు జ‌రిగినా కేసులు ఉండ‌వు. హోంమంత్రికి మ‌హ్మూద్ ఆలీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ముస్లిం యువ‌కులపై నమోదైన కేసులు నీరుగారిపోయిన సంద‌ర్భాలు అనేకం. ఇటీవ‌ల మెడిక‌ల్ స్టూడెంట్ ఆత్మ‌హ‌త్య అందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌.

`స్టీరింగ్ నా చేతిలోనే ఉందంటున్నారు.. యాక్సిండెంట్ చేస్తానేమో..`.(MIM Voice change)

మ‌జ్లిస్ బ‌లంగా ఉండే ప్రాంతాల్లోని ముస్లింలు విద్యుత్ బిల్లు బ‌కాయిలు వేల కోట్ల‌లో ఉంది. సుమారు రూ. 7వేల కోట్ల వ‌రకు బకాయిలు ఉన్న‌ట్టు అధికారికంగా తెలుస్తోంది. వాటిని వ‌సూలు చేసే ధైర్యం కూడా కేసీఆర్ స‌ర్కార్ చేయ‌దు. పైగా ఎంఐఎం, బీఆర్ఎస్ మిన‌హా ఇత‌ర విప‌క్షాలు ఉండ‌కూద‌న్న ధోర‌ణి కేసీఆర్ ఆధ్వ‌ర్యంలోని అసెంబ్లీ నిర్వ‌హ‌ణ గ‌మ‌నిస్తే బోధ‌ప‌డుతోంది. గ‌త తొమ్మిదేళ్లుగా స‌హ‌జ‌మిత్ర‌త్వాన్ని కొన‌సాగిస్తూ టీఆర్ఎస్, ఎంఐఎం బాగా ల‌బ్దిపొందాయ‌ని స‌ర్వ‌త్రా తెలిసిందే. అయితే, ఇప్పుడు కారు స్టీరింగ్ త‌న చేతిలో ఉంటే యాక్సిండెంట్ చేస్తానేమో అంటూ అసరుద్దీన్ చేసిన వ్యాఖ్య‌లు (MIM Voice change) బీఆర్ఎస్ పార్టీకి ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.

తొలి నుంచి ఎంఐంఎం కాంగ్రెస్ పార్టీ కూట‌మి 

తొలి నుంచి ఎంఐంఎం కాంగ్రెస్ పార్టీ మ‌ద్ధ‌తుతో ఎదిగింది. ఆ రెండు పార్టీలు కొన్ని ద‌శాబ్దాల పాటు కూట‌మి రాజ‌కీయాల‌ను న‌డిపాయి. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లిన సంద‌ర్భాలు అనేకం. తెలంగాణ ఏర్పాటు త‌రువాత మాత్ర‌మే కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం దూరం అయింది. గ‌త తొమ్మిదేళ్లుగా వివిధ రాష్ట్రాల్లోనూ ఒంట‌రిగా ఎంఐఎం పోటీ చేసింది. ఫ‌లితంగా కాంగ్రెస్ న‌ష్ట‌పోయింద‌ని స‌ర్వ‌త్రా తెలిసిందే. ప్ర‌త్యేకించి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్ రాష్ట్రాల్లో ఎంఐఎం దెబ్బ‌కు కాంగ్రెస్ వెనుక‌బ‌డ‌గా, బీజేపీ ల‌బ్దిపొందింది. ఇలాంటి ప‌రిణామం లేక‌పోవ‌డంతో క‌ర్ణాట‌క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. ఒక వేళ క‌ర్ణాట‌క‌లో ఎంఐఎం బ‌రిలో నిలిచిన‌ట్టైతే, బీజేపీ అధికారంలోకి వ‌చ్చి ఉండేద‌ని అంచ‌నా. ఎందుకంటే, చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో 500 నుంచి 3వేల ఓట్ల మోజార్టీతో కాంగ్రెస్ అభ్య‌ర్థులు బ‌య‌ట‌ప‌డ్డారు. అదే, ఎంఐఎం బ‌రిలో ఉంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలేది. అప్పుడు ఫ‌లితాలు యూపీ, బీహార్ త‌ర‌హాలో ఉండేవి.

Also Read : BRS Lose: ఆ ఎమ్మెల్యేలకు టికెట్స్ ఇస్తే.. 14 సీట్లు ఓడిపోవడం పక్కా!

తెలంగాణ రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే, గ్రేట‌ర్ లోని ఏడు నియోజ‌క‌వ‌ర్గామ‌లు మిన‌హా మిగిలిన చోట్ల టీఆర్ఎస్ కు గ‌త రెండు ఎన్నిక‌ల్లో ఓవైసీ మ‌ద్ధ‌తు ప‌లికారు. ఫ‌లితంగా రెండుసార్లు కేసీఆర్ అధికారంలోకి రాగ‌లిగారు. అందుకే, కారు స్టీరింగ్ ఓవైసీ వ‌ద్ద ఉంద‌ని కేంద్ర‌హోంశాఖ మంత్రి తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ప్ర‌తిసారి వ్యాఖ్యానిస్తారు. అలాంటి ప‌రిస్థితి లేద‌ని చెప్ప‌డానికి ఓవైసీ ఇప్పుడు వాయిస్ వినిపిస్తున్నారు. ఒక వేళ నిజంగా కారు స్టీరింగ్ నా చేతిలో ఉంటే మ‌సీదును కూల్చి సెక్ర‌ట‌రియేట్ క‌డ‌తారా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు, కొత్త స‌చివాల‌యం ముస్లిం రాజుల భ‌వ‌నాల త‌ర‌హాలో ఉంద‌ని బీజేపీ ఇటీవ‌ల చేసిన కామెంట్ కు విరుగుడుగా గుజ‌రాత్ లోని ఒక హ‌నుమాన్ దేవాల‌యం ఆకారాన్ని క‌లిగి ఉంద‌ని గ‌ళం విప్పారు. అంత వ‌రకు ఓకే, కారు స్టీరింగ్ త‌న చేతిలో ఉంటే యాక్సిడెంట్ చేస్తానేమో అంటూ(MIM Voice change) ఓవైసీ చేసిన వ్యాఖ్య‌లు ఇప్ప‌డు బీఆర్ఎస్ కు ఆందోళ‌న క‌లిగిస్తోంది.

Also Read : KCR Governament : వరంగ‌ల్ సెంట్ర‌ల్ జైలు తాక‌ట్టు! RBIకి ఫిర్యాదు

క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత కాంగ్రెస్ పార్టీ వైపు ముస్లిం ఓటు బ్యాంకు పూర్తిగా మారింది. దానికి అనుగుణంగా ఎంఐఎం కూడా అడుగులు వేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. లేదంటే, ఎంఐఎంను కూడా కాద‌ని ముస్లిం ఓట‌ర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే మూడ్ ఉంద‌ని స‌ర్వేల ద్వారా బీఆర్ఎస్, ఎంఐఎం గ్ర‌హించాయ‌ని తెలుస్తోంది. అందుకే, కేసీఆర్ ను ముస్లిం వ్య‌తిరేకిగా చూపే ప్ర‌య‌త్నం ఓవైసీ చేయ‌డం(MIM Voice change) మొద‌లు పెట్టారు. ఫ‌లితంగా బీజేపీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ వైపు వెళుతుంద‌ని అంచ‌నా. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పూర్వంలా వెళితే అధికారంలోకి రావ‌చ్చ‌ని ఓవైసీ ల‌క్ష్యంగా ఉంద‌ని టాక్‌. అందుకే, యాక్సిడెంట్ చేస్తానేమో అన్న‌ట్టు ఆయ‌న వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని భావించ‌డానికి అవ‌కాశం ఉంది.