Site icon HashtagU Telugu

Telangana: ఓటర్ స్లిప్‌లపై ఎంఐఎం పార్టీ గుర్తు: ఎన్నికల అధికారికి ఫిర్యాదు

Telangana

Telangana

Telangana: ఎంఐఎం అభ్యర్థి అత్యుత్సాహం ప్రదర్శించారు.ఓటర్‌ స్లిప్‌లపై పార్టీ గుర్తు ముద్రించి వినూత్న ప్రచారానికి తెరలేపారు. దీంతో ప్రత్యర్థి పార్టీలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.

యాకుత్‌పురా నియోజకవర్గంలో పోలింగ్ స్లిప్పులపై పార్టీ గుర్తును ప్రచురించి ఓటర్లకు పంచడం కలకలం రేపింది. ఎంఐఎం అభ్యర్థి జాఫర్‌ హుస్సేన్‌ మెరాజ్‌తో పాటు పార్టీ గుర్తులతో స్లిప్పులు పంపిణీ చేసిన కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఎంబీటీ అభ్యర్థి అమ్జదుల్లా ఖాన్ హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు . గుర్తులే కాకుండా ప్రత్యేక యంత్రాన్ని తయారు చేసి ఓటరు పేరు, వివరాలతో కూడిన ప్రింటౌట్ తీసి యంత్రం ద్వారా పంపిణీ చేస్తున్నారు.

స్లిప్ పైభాగంలో గాలిపటం గుర్తు ఉంది. ఆ తర్వాత ఓటరు వివరాలు, పోలింగ్ బూత్ వివరాలు ఉన్నాయి .ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని, ఓటర్ల డేటా అసలు ఎలా సేకరిస్తారు, మెషిన్‌లోకి డేటా ఎలా వచ్చిందని, అసలు మెషిన్ ఏంటని అమ్జదుల్లా ప్రశ్నలు సంధించారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్ర డీజీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

Also Read: Team India: టీ20 ప్రపంచకప్ తర్వాత శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న టీమిండియా..!