MIM Support to BRS : స‌హ‌జ మిత్రుల వ్యూహం! కాంగ్రెస్ ఓటుకు గండి!!

MIM Support to BRS : కాంగ్రెస్ ఓట్ల‌కు గండిప‌డేలా కేసీఆర్ వ్యూహాన్ని రచించారు. ఆ క్ర‌మంలో స‌హ‌జ మిత్రుడు ఎంఐఎం అండ తీసుకున్నారు.

  • Written By:
  • Updated On - September 25, 2023 / 05:25 PM IST

MIM Support to BRS : కాంగ్రెస్ ఓట్ల‌కు గండిప‌డేలా కేసీఆర్ వ్యూహాన్ని రచించారు. ఆ క్ర‌మంలో స‌హ‌జ మిత్రుడు ఎంఐఎం అండ తీసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో ఉభ‌య క‌మ్యూనిస్ట్ ల‌ను వాడిప‌డేసిన కేసీఆర్ ఇప్పుడు ఎంఐఎం మీదా ఆధార‌ప‌డ్డారు. కొత్త స‌చివాల‌యంలో మ‌సీదు నిర్మించినందుకు బ‌హుమానంగా బీఆర్ఎస్ కు ఓట్లు వేయాల‌ని అస‌రుద్దీన్ పిలుపునివ్వ‌డం గ‌మనార్హం.

కొత్త స‌చివాల‌యంలో మ‌సీదు  బ‌హుమానంగా బీఆర్ఎస్ కు ఓట్లు వేయాల‌ని అస‌రుద్దీన్ (MIM Support to BRS)

ఎంపిక చేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంఐఎం అభ్య‌ర్థుల‌ను నిలుపుతోంది. సుమారు 40 చోట్ల ఆ పార్టీ అభ్య‌ర్థుల‌ను నిలిపేలా ప్లాన్ చేస్తున్నారు. అక్క‌డ ముస్లిం ఓట్ల‌ను చీల్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ముస్లిం ఓటు బ్యాంకు సాలిడ్ గా కాంగ్రెస్ ఓన్ చేసుకుంది. ఫ‌లితంగా అధికారంలోకి రాగ‌లిగింది. అదే ఫార్ములాను (MIM Support to BRS) తెలంగాణ‌లోనూ ఉప‌యోగించాల‌ని కాంగ్రెస్ ప్ర‌య‌త్నం చేస్తోంది. అందుకే, కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా ఎంఐఎంను అస్త్రంగా ప్ర‌యోగించారు.

ఎంపిక చేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంఐఎం అభ్య‌ర్థుల‌ను నిలుపుతోంది

దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్య‌తిరేకంగా ముస్లింలు ఉన్నార‌ని స‌ర్వ‌త్రా వినిపించే మాట‌. ఆ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు సాలిడ్ గా ఈసారి ఎన్నిక‌ల్లో ప‌డుతుంద‌ని స‌ర్వేల సారాంశం. అందుకే, ఆ ఓట్ల‌ను చీల్చ‌డానికి బీజేపీతో ఉన్న పార్టీలు వేస్తోన్న ఎత్తుగ‌డ‌. అందులో భాగంగా కేసీఆర్ వేస్తోన్న వ్యూహంగా కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే, రాహుల్ గాంధీ ఇటీవ‌ల జ‌రిగిన తుక్కుగూడ స‌భ‌లో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటేనంటూ నిన‌దించారు. ప్ర‌తిగా అస‌రుద్దీన్ బీఆర్ఎస్ కు ముందుగా (MIM Support to BRS)మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించారు.

Also Read : KCR Strategy: గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూకుడు.. బుజ్జగింపులు, చేరికలపై కేసీఆర్ గురి!

తెలంగాణ వ్యాప్తంగా 40 నియోజ‌క‌వ‌ర్గాల్లో ముస్లింల ప్రాబ‌ల్యం ఎక్కువ‌గా ఉంది. అక్క‌డ ఎంఐఎం పోటీ చేయ‌నుంది. మిగిలిన చోట్ల బీఆర్ఎస్ కు ఓటు వేయాల‌ని అస‌రుద్దీన్ ఇచ్చిన పిలుపు. అంటే, ముస్లిం ఓట్ల‌ను చీల్చ‌డం ద్వారా కేసీఆర్ మూడోసారి సీఎం కావాల‌ని స్కెచ్ వేశారు. ఫ‌లితంగా క‌ర్ణాట‌క మాదిరిగా తెలంగాణ‌లో కాంగ్రెస్ వ్యూహం ప‌నిచేసేలా క‌నిపించ‌డంలేదు. పైగా రాహుల్ గాంధీని రెచ్చ‌గొడుతూ అస‌రుద్దీన్ మాట్లాడారు. హైద‌రాబాద్ లో పోటీ చేయాల‌ని స‌వాల్ విసిరారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ వ్యాప్తంగా రాజ‌కీయ ఈక్వేష‌న్లు ఎలా మార‌బోతున్నాయో, స్ప‌ష్టం అవుతోంది.

Also Read : CBN Arrest Effect : BRS పార్టీలో చీలిక‌?, `పోచారం` రియాక్ష‌న్ తో అప్ర‌మ‌త్తం!

ఎంఐఎంతో స‌హ‌జ మిత్రులుగా ప‌నిచేస్తామ‌ని కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ కూడా ఆ రెండు పార్టీల పొత్తుతో న‌డుస్తోంది. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ కేసీఆర్ కు మ‌ద్ధ‌తుగా ఎంఐఎం నిలిచింది. అందుకు ప్ర‌తిగా సీఎం హోదాలో కేసీఆర్ ప‌లు ర‌కాలు స‌హాయ స‌హ‌కారాలు అసరుద్దీన్ కు అందిస్తుంటార‌ని స‌ర్వ‌త్రా వినిపించే మాట‌. ఈసారి ఎన్నిక‌ల్లో కూడా కేసీఆర్ ను సీఎం చేయ‌డానికి ఎంఐఎం ప్లాన్ చేస్తోంది. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ కు అండ‌గా ఉన్న ఎంఐఎం రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత కేసీఆర్ ప‌క్షాన చేరింది.