Site icon HashtagU Telugu

AIMIM Target 50: MIM పొలిటికల్ గేమ్.. 50 స్థానాలపై గురిపెట్టేనా!

MiM-BRS

AIMIM

తెలంగాణ (Telangana) రాజకీయాలు ఆసక్తికరంగా మారబోతున్నాయి. వచ్చే ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని ఇప్పట్నుంచే కార్యాచరణను రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీలు సైతం దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలోని 119 స్థానాల్లో తమ పార్టీ కనీసం 50 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని పార్టీ 50 స్థానాల్లో పోటీ చేయదని, ఇది భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అవకాశాలను దెబ్బతీస్తుందని కాషాయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు బుధవారం అన్నారు. బీఆర్‌ఎస్ స్టీరింగ్ ఏఐఎంఐఎం (AIMIM) చేతిలో ఉందని, ఒవైసీ పార్టీకి సంబంధించిన నట్స్ అండ్ బోల్ట్‌లు తెలంగాణ సీఎం కేసీఆర్ వద్ద ఉన్నాయని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఏఐఎంఐఎంకు కేవలం ఏడు సీట్లు మాత్రమే ఉన్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు (KTR) చేసిన వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు.

కేటీఆర్ ప్రకటనపై అక్బరుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ  “(AIMIM)పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నేను చాలా సీరియస్‌గా తీసుకున్నాను. నేను మా పార్టీ అధ్యక్షుడితో మాట్లాడి రాబోయే ఎన్నికల్లో మరిన్ని స్థానాల్లో పోటీ చేసేలా చూస్తానని హామీ ఇస్తున్నా. కనీసం 50 స్థానాల్లో పోటీ చేసి 15 స్థానాల్లో విజయం సాధించేలా చూస్తా. నా పార్టీ అధ్యక్షుడు ఒప్పుకునేలా చూస్తాను” అని అక్బరుద్దీన్ తేల్చి చెప్పారు. తెలంగాణలోని మొత్తం 199 నియోజకవర్గాలకు ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అన్ని స్థానాల్లో పోటీ చేసి 88 స్థానాల్లో విజయం సాధించింది.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ పెట్టుకుంది. GHMC ఎన్నికలలో లెక్కకు మించి స్థానాలు గెలుపొందడంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలుచుకోవడానికి బిజెపి ఎటువంటి అవకాశాన్ని వదలడం లేదు. అయితే సంక్షేమ పథకాలు, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల కారణంగా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ (BRS) మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని గతంలో ఓ సర్వేలో వెల్లడైంది. అయితే అధికార పార్టీకి సీట్ల వాటా తగ్గవచ్చని అంచనా వేసింది.

Also Read: Kanna Lakshminarayana: బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ గుడ్ బై!

Exit mobile version