Site icon HashtagU Telugu

MIM : చార్మినార్‌లో ఎంఐఎం వెనుకంజ.. పాలకుర్తిలో ఎర్రబెల్లి వెనుకంజ

Mp Asaduddin Owaisi Women R

Mp Asaduddin Owaisi Women R

MIM :  చార్మినార్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎంఐఎం వెనుకంజలో ఉంది.  అక్కడ బీజేపీ లీడ్‌లో ఉంది. చార్మినార్‌లో తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థికి అత్యధికంగా 2539 ఓట్ల లీడ్ వచ్చింది.  మజ్లిస్ కంచుకోటలో అనూహ్య ఫలితం వస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక వరంగల్ తూర్పు అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ లీడ్‌లో ఉన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వెనుకంజలో ఉన్నారు. పాలకుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామేల్ ఆధిక్యంలో ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందుంజలో ఉన్నట్టు సమాచారం. అంతేకాదు.. కాంగ్రెస్ అభ్యర్థులు కూడా లీడ్ లో ఉన్నారు. కాగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడు కౌంటింగ్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా, నల్గొండ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందంజలో ఉన్నారు. ఇతర జిల్లాలో మొదలైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ పార్టీనే ముందుండటం(MIM) గమనార్హం.

Also Read: TS Elections: ఓట్ల లెక్కింపులో దూసుకుపోతున్న కాంగ్రెస్, 60 స్థానాలతో ముందంజ