MIM-BRS : తెలంగాణ `గాలిప‌టం` వాటం! ఎంఐఎంతో కేసీఆర్ జోడీ!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులు ఎలా ఉంటాయి? ఎంఐఎం, బీఆర్ఎస్(MIM-BRS) మ‌ధ్య ఎలా ఉంటుంది?

  • Written By:
  • Updated On - February 21, 2023 / 04:03 PM IST

తెలంగాణ వ్యాప్తంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులు ఎలా ఉంటాయి? ఎంఐఎం, బీఆర్ఎస్(MIM-BRS) మ‌ధ్య ఎలా ఉంటుంది? కాంగ్రెస్, బీఆర్ఎస్ క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ‌తాయా? ఇలాంటి ప్ర‌శ్న‌లు ఎన్నో ఉత్ప‌న్నం అవుతున్నాయి. వీటికి తొలి స‌మాధానంగా కేసీఆర్(KCR) ఎంఐఎంతో క‌లిసి వెళ్ల‌నున్నార‌ని తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం నిరూపిస్తోంది. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి మార్చి 13న‌ జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)కి మద్దతు ఇవ్వాలని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మంగళవారం నిర్ణయించింది. ఏఐఎంఐఎం పార్టీ చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు ఈ నిర్ణయం తీసుకున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఎంఐఎం, బీఆర్ఎస్ పొత్తు(MIM-BRS)  

అంతకుముందు కూడా బీఆర్‌ఎస్ ఈ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఏఐఎంఐఎంకు(MIM-BRS) మద్దతు ఇచ్చింది. అయితే ఈసారి ప‌రిస్థితి వేరు. తెలంగాణ కోసం ఏర్ప‌డిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారింది. జాతీయ స్థాయి రాజ‌కీయాలు చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ఇదే త‌ర‌హా ప్ర‌య‌త్నం ఎంఐఎం కూడా గ‌త కొన్నేళ్లుగా చేస్తోంది. ఇప్ప‌టికే ఆ పార్టీ బీహార్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల‌ను గెలిపించుకుంది. యూపీలోనూ పోటీచేసి కొంత మేర ప్ర‌భావం చూపింది. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లోనూ కీ రోల్ పోషించాల‌ని ప్ర‌య‌త్నం చేసింది. అయితే, బీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ మిన‌హా ఎక్క‌డా లేదు. రాబోవు ఎన్నిక‌ల్లో దేశ వ్యాప్తంగా విస్త‌రించాల‌ని ప్లాన్ చేస్తోంది. ఇక్క‌డే ఆ రెండు పార్టీల మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంది.

Also Read : BJP Challenges AIMIM: ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధం.. MIMకు ‘బండి’ ఛాలెంజ్!

జాతీయ స్థాయిలో చాలాకాలం పాటు కాంగ్రెస్ పార్టీతో క‌లిసి ఎంఐఎం ప‌నిచేసింది. ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల్లో టీఆర్ఎస్ ప‌క్షాన నిలిచింది. స‌హ‌జ మిత్రునిగా కొనసాగుతోంది. అయితే, వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడే ఎంపీ అసరుద్దీన్ ఈసారి బీఆర్ఎస్ పార్టీకి (MIM-BRS) మ‌ద్ధ‌తు ఇస్తార‌న్న న‌మ్మ‌కం లేదు. రాబోయే ఎన్నిక‌ల్లో ఒక వేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే కేటీఆర్ నేరుగా సీఎం అవుతార‌ని పార్టీ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. అందుకే, ఇప్ప‌టి నుంచి అసెంబ్లీ లోప‌ల‌, బ‌య‌ట యాక్టింగ్ సీఎంగా కేటీఆర్ క‌నిపిస్తున్నారు. స‌రిగ్గా ఇక్క‌డే అస‌రుద్దీన్ కు అభ్యంత‌రమ‌ని ఎంఐఎం శ్రేణుల అభిప్రాయం. ఆ త‌ర‌హా గ్యాప్ ఇటీవ‌ల అసెంబ్లీ వేదిక‌గా అక్బ‌రుద్దీన్‌, కేటీఆర్ మ‌ధ్య న‌డిచింది. ఒకానొక స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్యా టైమ్ కేటాయింపు విష‌యంలో వాడివేడి చ‌ర్చ న‌డిచింది.

అసెంబ్లీ వేదిక‌గా అక్బ‌రుద్దీన్‌, కేటీఆర్ మ‌ధ్య..

ఇక కాంగ్రెస్ పార్టీతో క‌లిసి వెళ్ల‌డం కంటే ఒంట‌రిగా వెళ్లాల‌ని ఎంఐఎం ఈసారి ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుతోంద‌ని తెలుస్తోంది. ఏపీలోనూ ఎంట్రీ ఇవ్వాల‌ని ప్లాన్ చేస్తుంద‌ట. తెలంగాణ వ్యాప్తంగా క‌నీసం 50 స్థానాల్లో పోటీ చేయాల‌ని ప్రాథ‌మికంగా ఎంఐఎం భావిస్తున్న‌ట్టు వినికిడి. ఒక వేళ కేటీఆర్ ను ముందుగానే సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తే మాత్రం తెలంగాణ వ్యాప్తంగా `గాలిప‌టం` ఎన్నిక‌ల చిత్రంలో క‌నిపించ‌నుంది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 20 మంది ఎమ్మెల్యేలు మిన‌హా ఉండ‌ర‌ని బీజేపీ అంచ‌నా వేస్తోంది. అందుకే, ఎంఐఎం పోటీ చేసే స్థానాల‌పై తెలంగాణ బీజేపీ చీఫ్ ఎప్ప‌టిక‌ప్పుడు ఛాలెంజ్ చేస్తున్నారు. ఇక క‌మ్యూనిస్ట్ లు మునుగోడు ఎన్నిక‌ల్లో మాదిరిగా కలిసి బీఆర్ఎస్ పార్టీతో పనిచేసే ఆలోచ‌న త‌క్కువ‌గా ఉంది. జాతీయ ఈక్వేష‌న్ల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీతో క‌లిసి వెళ్ల‌నున్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అందుకు బలం చేకూరేలా ఇటీవ‌ల ఖ‌మ్మం పాద‌యాత్ర సంద‌ర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అడుగుల‌ను కామ్రేడ్లు అనుస‌రించారు.

Also Read : Revanth Reddy : BRS,కాంగ్రెస్`పొత్తు`పై కోమ‌టిరెడ్డి పొడుపు! కాంగ్రెస్లో క‌ల్లోలం!!

ఇలాంటి ఈక్వేష‌న్ల న‌డుమ కేసీఆర్ తాజాగా ఎంఐఎంకు ప్ర‌క‌టించిన మ‌ద్ధ‌తు పనిచేసే అవ‌కాశం త‌క్కువ‌. కేవ‌లం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వ‌ర‌కు మాత్ర‌మే ఈ మ‌ద్ధ‌తు ఉంటుంద‌ని రాజ‌కీయ పండితుల అభిప్రాయం. ఒక వేళ బాహాటంగా ఎంఐఎం, బీఆర్ఎస్ (MIM-BRS) పొత్తు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పెట్టుకుంటే హిందూ పోల‌రైజేష‌న్ భారీగా కేసీఆర్ (KCR) కు గండికొట్ట‌నుంది. దీనికి తోడు కేటీఆర్ సీఎం అభ్య‌ర్థి అనేది తెలంగాణ రాజ‌కీయ ఈక్వేష‌న్ల‌ను భారీ మార్చ‌నుంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.