MLA Quota MLCs: మజ్లిస్, సీపీఐకు చెరొకటి.. 2 ఎమ్మెల్సీ సీట్లలో కాంగ్రెస్‌ లెక్కలివీ

ఇలా రెండు పోనూ, కాంగ్రెస్ పార్టీకి మిగిలేది రెండే ఎమ్మెల్సీ(MLA Quota MLCs) సీట్లు.

Published By: HashtagU Telugu Desk
Mla Quota Mlc Elections Congress Mim Cpi Mlc Seats

MLA Quota MLCs: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద కసరత్తే చేస్తోంది. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగు కాంగ్రెస్‌కే దక్కనున్నాయి. దీంతో వాటిని ఏయే సామాజిక వర్గాల వారికి కేటాయించాలనే దానిపై హస్తం పార్టీలో మేధోమధనం నడుస్తోంది.  ఈ రేసులో సీఎం సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. సామాజిక కూర్పులో భాగంగా ఆయనకు ఈసారి ఎమ్మెల్సీగా ఛాన్స్ దక్కకపోతే, తదుపరిగా రాజ్యసభకు పంపే అవకాశం ఉందట.  ఇక తనకు దక్కే నాలుగు ఎమ్మెల్సీ సీట్లలో ఒకదాన్ని మజ్లిస్‌కు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోందనే టాక్ వినిపిస్తోంది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ మద్దతు కోసం ఈ సీటును వదులుకునేందుకు హస్తం పార్టీ సిద్ధపడుతోందని అంటున్నారు. అంతేకాదు తమ కోటాలోని మరొక ఎమ్మెల్సీ సీటును సీపీఐకి కూడా కాంగ్రెస్ ఇచ్చుకోబోతోందట.

Also Read :Earthquake : మనదేశంలో మరో భూకంపం.. రోడ్లపైకి జనం పరుగులు

మిగిలిన రెండు సీట్లలో చాలా లెక్కలు..

  • ఇలా రెండు పోనూ, కాంగ్రెస్ పార్టీకి మిగిలేది రెండే ఎమ్మెల్సీ(MLA Quota MLCs) సీట్లు.
  • వీటిని రెడ్డి, బీసీ వర్గాలకు కేటాయించే ఛాన్స్ లేదని అంటున్నారు. ఎందుకంటే, ఈ రెండు వర్గాలకు ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గంలో, తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ కీలక పదవుల్లో అవకాశం కల్పించారు.
  • అయితే టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌యాదవ్‌, ప్రధాన కార్యదర్శి చరణ్‌కౌశిక్‌ యాదవ్‌ తదితర యాదవ వర్గం నేతలు ఎమ్మెల్సీ పదవి కోసం జోరుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
  • కాంగ్రెస్ పార్టీ పదవుల్లో ఉన్న వారికి ఒక ఎమ్మెల్సీ సీటును ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ లిస్టులో టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు కుమార్‌రావు, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయట.
  • ఎస్సీ సామాజికవర్గం నుంచి కచ్చితంగా ఒకరికి ఎమ్మెల్సీ దక్కనుంది. ఈ రేసులో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, దొమ్మాటి సాంబయ్య, రాచమళ్ల సిద్దేశ్వర్‌ ఉన్నారు.
  • ఇప్పటికే గవర్నర్‌ కోటాలో ఆమెర్‌ అలీఖాన్‌ను ఎమ్మెల్సీని చేశారు. అందుకే ఈసారి ముస్లింలకు ఛాన్స్ ఉండకపోవచ్చు.
  • శుక్రవారం రోజు గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌ఛార్జి మీనాక్షీ నటరాజన్‌, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమై అభ్యర్థుల ఎంపికపై తుది కసరుత్తు చేయనున్నారు.
  • ఒక్కో సీటుకు ఇద్దరు లేదా ముగ్గురి పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానానికి టీపీసీసీ పంపనుంది.
  • ఈ వారంలోనే ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయనుంది.

Also Read :Meta India Head: మెటా ఇండియా హెడ్ గురించి మీకు ఈ విష‌యాలు తెలుసా?

  Last Updated: 27 Feb 2025, 07:50 AM IST