Mid Night Sketch : కాంగ్రెస్ కీల‌క లీడ‌ర్ల‌కు అర్థ‌రాత్రి `వేణు`గానం

Mid Night Sketch : కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్. గాంధీ కుటుంబం త‌రువాత ప్రాధాన్యం ఉండే కోట‌రీలోని లీడ‌ర్.

  • Written By:
  • Publish Date - September 7, 2023 / 05:15 PM IST

Mid Night Sketch : కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్. దాదాపుగా గాంధీ కుటుంబం త‌రువాత ప్రాధాన్యం ఉండే కోట‌రీలోని లీడ‌ర్. ఆయ‌న ఇచ్చే డైరెక్ష‌న్ మేర‌కు కాంగ్రెస్ పార్టీ న‌డుస్తోంది. తెలంగాణ‌లోనూ అదే జ‌రుగుతోంది. గ‌తంలో పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియ‌మించిన స‌మ‌యంలో మాత్రం ఆయ‌న త‌ట‌ప‌టాయించార‌ని సీనియ‌ర్లు చెబుతుంటారు. ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాలు కూడా కేసీ వేణుగోపాల్ అనుకున్న విధంగా తెలంగాణ‌లో క‌నిపించాయ‌ని అధిష్టానంలోని వినికిడి. అందుకే, మాణిక్ ఠాకూర్ ను తెలంగాణ ఇంచార్జిగా మార్చేశారు. అప్ప‌ట్లో రాజు కీల‌క పాత్ర పోషించ‌డం కార‌ణంగా పీసీసీ నియామ‌కం జ‌రిగింద‌ని సీనియ‌ర్లలోని అభిప్రాయం.

స్టార్ హోట‌ల్లో కీల‌క లీడ‌ర్లు ముగ్గురితో. మంత‌నాలు(Mid Night Sketch ) 

ఒక‌టన్న‌ర ఏడాదిగా తెలంగాణలో జ‌రిగిన ప‌రిణామాల‌ను కేసీ వేణుగోపాల్ బాగా గ‌మ‌నించారు. సీనియ‌ర్ల‌తో ఎప్ప‌టి నుంచో స‌ఖ్య‌త‌గా ఉండే ఆయ‌న పూర్తి స‌మ‌చారాన్ని సేక‌రించారు. దానికి తోడుగా సునీల్ కొనుగోలు ఇచ్చిన స‌ర్వే రిపోర్టులు. రిటైర్ట్ ఐఏఎస్ శ‌శిథ‌ర్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్. యువ‌రాజు రాహుల్ టీమ్ చేసిన స‌ర్వేలు, ప్రియాంక కోట‌రీ ఇచ్చిన స‌మాచారం వెర‌సి వేణుగోపాల్ వ‌ద్ద ఉంది. దాన్ని బేస్ చేసుకుని అర్థ‌రాత్రి కీల‌క నేత‌ల‌తో ఆయ‌న భేటీ అయ్యారు. ఈనెల 16, 17 తేదీల్లో జ‌రిగే సీడబ్ల్యూసీ మీటింగ్‌, బ‌హిరంగ స‌భ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించేందుకు హైద‌రాబాద్ వ‌చ్చిన ఆయ‌న అర్థ‌రాత్రి మీటింగ్  (Mid Night Sketch )పెట్ట‌డం కాంగ్రెస్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఫోన్లో కేసీ వేణుగోపాల్ నుంచి కోమ‌టిరెడ్డికి హామీ

అల‌క‌పాన్పు ఎక్కిన కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డితో నేరుగా ఫోన్లో కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. అంతేకాదు, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్న మాణిక్ రావ్ థాక్రేను ఆయ‌న ఇంటికి పంపారు. అధిష్టానం చిన్న‌చూపు ప‌ట్ల కినుక వ‌హించిన కోమ‌టిరెడ్డికి ఓదార్పును ఇచ్చారు. ఫోన్లో కేసీ వేణుగోపాల్ నుంచి కోమ‌టిరెడ్డికి ఎలాంటి హామీ ల‌భించిందోగానీ ప్ర‌స్తుతం ఆయ‌న మౌనంగా ఉన్నారు. అదే రోజు రాత్రి (మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి) పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, శాస‌న‌స‌భాప‌క్ష నేత భ‌ట్టి విక్ర‌మార్క్, మాజీ పీసీసీ చీఫ్‌, స్కీనింగ్ క‌మిటీ స‌భ్యుడు, కాంగ్రెస్ జాతీయ ఎన్నిక‌ల క‌మిటీ మెంబ‌ర్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో ర‌హ‌స్యంగా కేసీ భేటీ అయ్యారు. హైద‌రాబాద్ లోని ఒక స్టార్ హోట‌ల్లో కీల‌క లీడ‌ర్లు ముగ్గురితో (Mid Night Sketch ) మంత‌నాలు సాగించారు.

జావెద్ అండ్  న‌వీన్ చౌద‌రి  టీమ్ క్షేత్ర‌స్థాయిని

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాల‌ను చేతిలో ప‌ట్టుకున్న కేసీ వేణుగోపాల్ సీనియ‌ర్లు, రేవంత్ రెడ్డి మ‌ధ్య ఉన్న గ్యాప్ ను గుర్తించార‌ట‌. ఆ గ్యాప్ ను పూడ్చ‌డానికి పూర్తిగా అధిష్టానం రంగంలోకి దిగింది. ఇప్ప‌టికే పార్ల‌మెంట్ ప‌రిధిలో అధిష్టానం నియ‌మించిన ఇద్ద‌రు ప‌రిశీల‌కులు ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం చేర‌వేస్తున్నారు. ఇంకో వైపు జావెద్ అండ్  న‌వీన్ చౌద‌రి  టీమ్ క్షేత్ర‌స్థాయిని ప‌రిశీలిస్తోంది. ఇప్పుడు ఏకంగా అధిష్టానం రంగంలోకి దిగింది. దీంతో పీసీసీకి స‌మాంతరంగా వ్యూహాలు జ‌రిగిపోతున్నాయి. ఒక‌ప్పుడు శ‌శిథ‌రూర్ తెలంగాణ రాష్ట్రానికి చెప్ప‌కుండా వ‌చ్చాడ‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ధ్వ‌జ‌మెత్తిన రేవంత్ రెడ్డి ఇప్పుడు జ‌రుగుతోన్న ప‌రిణామాల‌ను మౌనంగా చూస్తున్నారు. అభ్య‌ర్థుల ఎంపిక నుంచి ప్ర‌చారం వ‌ర‌కు స‌ర్వం అధిష్టానం చేతిలోకి వెళ్లి పోయింది. ఆ డైరెక్ష‌న్ ఇచ్చేందుకు అర్థ‌రాత్రి (Mid Night Sketch ) కేసీ వేణుగోపాల్ కీల‌క లీడ‌ర్ల‌తో మీటింగ్ ఏర్పాటు చేసిన‌ట్టు గాంధీభ‌వ‌న్ వ‌ర్గాల్లోని టాక్‌.

Also Read : Congress Fight : గాంధీభ‌వ‌న్లో టిక్కెట్ల లొల్లి

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన వరంగ‌ల్ స‌భ‌, మంచిర్యాల‌, ప్రియాంక పాల్గొన్న హైద‌రాబాద్ స‌భ‌ల‌కు భిన్నంగా సెప్టెంబ‌ర్ 17వ తేదీ స‌భ జ‌ర‌గాల‌ని కేసీ వేణుగోపాల్ టార్గెట్ పెట్టారు. పీసీసీ, డీసీసీల మ‌ధ్య ఉన్న గ్యాప్ ను సరిచేసే టీమ్ ను కూడా ఏర్పాటు చేశారు. స‌భ‌లు పెట్టిన ప్ర‌తిసారీ ఏదో ఒక రూపంలో కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. వాటిని పున‌రావృతం కాకుండా చేసేలా వేణుగోపాల్ దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలుస్తోంది. మొత్తం మీద సెప్టెంబ‌ర్ 17 వ్య‌వ‌హారాల‌ను కూడా నేరుగా అధిష్టానం క్షేత్ర‌స్థాయికి వ‌చ్చి చూసుకోవ‌డం స్థానికంగా ఉండే ప‌రిస్థితుల‌కు అద్దంప‌డుతోంది.

Also Read : Congress New Strategy : కాంగ్రెస్ న‌యా పోక‌డ‌! కోమ‌టిరెడ్డికి పదోన్న‌తి హామీ!