పార్కింగ్ విషయంలో హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) యాజమాన్యం వెనక్కు తగ్గింది. ఇటీవల నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఉచిత పార్కింగ్ సదుపాయం ఎత్తివేస్తూ ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 25 నుంచి నాగోల్ మెట్రో, సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్‌లో మెట్రో పార్కింగ్ లాట్లో పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తామని ఇటీవల కీలక ప్రకటన చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రయాణికుల నుంచి అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మెట్రో పార్కింగ్ పీజుల విషయంలో వెనక్కు తగ్గింది. నాగోల్, మియాపూర్ మెట్రో వద్ద పెయిడ్ పార్కింగ్ నిర్ణయాన్ని యాజమాన్యం వాయిదా వేసింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని హైదరాబాద్ మెట్రో యాజమాన్యం ప్రకటన చేసింది.
Read Also : Nagarjuna : ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైకోర్టులో నాగార్జున పిటిషన్.. మధ్యంతర ఉత్తర్వులు