Merger of YSRTP : టీ కాంగ్రెస్ లోకే ష‌ర్మిల‌.? చ‌క్రం తిప్పిన డీకే!!

Merger of YSRTP : వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల పాలేరును వ‌దిలేశారా? ఖ‌మ్మం ఎంపీగా పోటీ చేయ‌బోతున్నారా?

  • Written By:
  • Updated On - October 2, 2023 / 01:22 PM IST

Merger of YSRTP : వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల పాలేరును వ‌దిలేశారా? ఖ‌మ్మం ఎంపీగా పోటీ చేయ‌బోతున్నారా? క‌ర్ణాట‌క నుంచి రాజ్య‌స‌భ ఎంపీ కాబోతున్నారా? వైఎస్సాఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయ‌బోతున్నారా? ఇదే ప్ర‌శ్న‌లు ఇప్పుడు లోట‌స్ పాండ్ నుంచి గాంధీభ‌వ‌న్ వ‌ర‌కు వినిపిస్తున్నాయి. ఏది వాస్తవం? ఏది అవాస్తం? అనే దానిపై కాంగ్రెస్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే, మ‌రో రెండు రోజుల్లో ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వ‌స్తాయ‌ని లోట‌స్ పాండ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే, మ‌రోసారి ష‌ర్మిల ఢిల్లీ వెళుతున్నార‌ని తెలుస్తోంది.

పాలేరు అభ్య‌ర్థిత్వం ష‌ర్మిల‌కు క్లోజ్ (Merger of YSRTP)

గ‌త రెండు నెల‌లుగా ష‌ర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం (Merger of YSRTP) అనే మాట వినిపిస్తోంది. ఆ ప్ర‌క్రియ‌ను బెంగుళూరు కేంద్రంగా డీకే శివ‌కుమార్ ఆధ్వ‌ర్యంలో న‌డుపుతున్నార‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే, కాంగ్రెస్ పార్టీలోని ఒక వ‌ర్గం ఆమె చేరిక‌ను వ్య‌తిరేకిస్తోంది. అందుకే, ఇటీవ‌ల హైద‌రాబాద్ లో జ‌రిగిన కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం ముందు ష‌ర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే అంశం వాయిదా ప‌డింద‌ని పార్టీలోని ఒక వ‌ర్గం చెబుతోన్న మాట‌. ప్ర‌ధానంగా పీసీసీ చీఫ్. రేవంత్ రెడ్డి వ్య‌తిరేకించ‌డం కార‌ణంగా ష‌ర్మిల చేరిక నిలిచిపోయింద‌ని స‌ర్వ‌త్రా వినిపించే టాక్‌. కానీ, బెంగుళూరు కేంద్రంగా డీకే శివ‌కుమార్ మాత్రం మ‌రోసారి చ‌క్రం తిప్పార‌ని తెలుస్తోంది. ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే ప్ర‌క్రియ‌ను ఫైన‌ల్ చేసిన‌ట్టు స‌మాచారం.

డీకే శివ‌కుమార్ మాత్రం మ‌రోసారి చ‌క్రం

కాంగ్రెస్ పార్టీలో చేర‌డానికి కొన్ని కండీష‌న్ల‌ను ష‌ర్మిల పెట్టారు. ఆమెకు పాలేరు టిక్కెట్ తో పాటు మ‌రో మూడు స్థానాల‌ను త‌న అనుచ‌రుల‌కు ఇవ్వాల‌ని ప్ర‌ధాన కండీష‌న్. కానీ, ప్ర‌స్తుతం త‌మ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కాంగ్రెస్ పార్టీలో చేరిన త‌రువాత పాలేరు అభ్య‌ర్థిత్వం ష‌ర్మిల‌కు క్లోజ్ అయింది. ప్ర‌త్యామ్నాయంగా ఖ‌మ్మం ఎంపీగా పోటీ చేయాల‌ని సూచించిన‌ట్టు తెలుస్తోంది. అయితే, ఆమె తెలంగాణ కాంగ్రెస్ లోనే క‌నిపించ‌డానికి లేద‌ని రేవంత్ వ‌ర్గం డిమాండ్. దీంతో మ‌ధ్యేమార్గంగా క‌ర్ణాట‌క నుంచి రాజ్య‌స‌భ ఎంపీగా ఆమెకు క‌ట్ట‌బెట్టాల‌ని అధిష్టానం భావిస్తుంద‌ట‌. అందుకు, ఆమె అంగీకారం తెలిపితే, ష‌ర్మిల పార్టీ ఎపిసోడ్ కాంగ్రెస్ లో  (Merger of YSRTP)  క‌లిసిపోతుంది.

Also Read : Delhi to AP : స‌త్య‌మేవ జ‌య‌తే..! లూథ్రా ట్వీట్  ట్విస్ట్! 

ఏపీ రాజ‌కీయ వేదిక‌పై క‌నిపించ‌డానికి ఏ మాత్రం ష‌ర్మిల అంగీకారం తెలప‌డంలేదు. మెట్టినిల్లుగా భావిస్తోన్న తెలంగాణ రాష్ట్రంలోనే తాడేపేడో తేల్చుకోవాల‌ని ఆమె భావిస్తున్నార‌ని లోట‌స్ పాండ్ వ‌ర్గాల్లోని చర్చ‌. ఆ క్ర‌మంలో ఖ‌మ్మం నుంచి ఎంపీగా పోటీ చేయ‌డానికి ఆమె సిద్ద‌ప‌డ్డార‌ట‌. అందుకు, అధిష్టానం అంగీకారం తెలుపుతుంద‌ని ఆమె భావిస్తున్నారు. ఆ మేర‌కు హామీ తీసుకోవ‌డానికి రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ కూడా చ‌క్రం తిప్పార‌ని వినికిడి. మొత్తం మీద పాలేరును వ‌దులుకుని ఒక మెట్టు దిగిన ష‌ర్మిల‌, తెలంగాణ రాజ‌కీయ వేదిక మీద క‌నిపించే విష‌యంలో విజ‌యం సాధించార‌ని డీకే వ‌ర్గాల నుంచి అందుతోన్న స‌మాచారం. ఇక వైఎస్సాఆర్ టీపీ విలీనం, కాంగ్రెస్ లో ష‌ర్మిల చేర‌డం లాంఛ‌న‌మేనంటూ వినిపిస్తోంది.

Also Read : YS Sharmila: TSPSC కమిషన్ ను ప్రగతి భవన్ సర్వీస్ కమీషన్ గా మార్చారు : వైఎస్ షర్మిల