Site icon HashtagU Telugu

Summer: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. మండుతున్న ఎండలు!

Summer

Summer

గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఒక్కసారిగా హైదరాబాద్‌ హీటెక్కుతోంది. బుధవారం అత్యధిక ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నప్పటికీ, నగరంలో కొన్ని రోజులు ముందు నుంచే, ఎండకాలం మొదలైనట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో ఎండలు భగ్గుమంటున్నాయి. బుధవారం నగరంలో సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లో అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. మౌలాలీలో 14.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నుండి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) అంచనా ప్రకారం, రాబోయే మూడు రోజుల పాటు నగరంలో ప్రధానంగా పొడి వాతావరణం ఉంటుంది. వారంలో పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెల్సియస్ నుండి 35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చు మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల సెల్సియస్ నుండి 20 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చు. ఇక, తెలంగాణలో ఈ నెలలో పగటి ఉష్ణోగ్రతలు 37 నుంచి 40 సెల్సియస్‌ డిగ్రీల వరకు నమోదు కావొచ్చని అధికారులు తెలిపారు. ఏప్రిల్‌లో  40 నుంచి 45 డిగ్రీలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మే నెల నుంచి జూన్‌ మొదటి వారం వరకు దాదాపు 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.