Site icon HashtagU Telugu

Hyderabad: బేగంబజార్ లో అత్యధికంగా 40.7°C ఉష్ణోగ్రత నమోదు

Hyderabad

Hyderabad

Hyderabad: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇంకా ఏప్రిల్‌ లోకి రాకముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. హైదరాబాద్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. గురువారం బేగంబజార్ ధూద్ ఖానాలో అత్యధికంగా 40.7°C ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం నల్గొండలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 41.0°C, హైదరాబాద్‌లోని బేగంబజార్ దూద్‌లో 40.7°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సాధారణ 36.3 డిగ్రీల సెల్సియస్‌తో పోలిస్తే జిహెచ్‌ఎంసి గరిష్ట సగటు ఉష్ణోగ్రత 37.4 డిగ్రీలుగా ఉంది. మోండామార్కెట్‌లో 40.2°సెల్సియస్‌, నాచారంలో 39.5°సెల్సియస్‌, ఆసిఫ్‌నగర్‌లో 39.5°సెల్సియస్‌, సీతాఫల్‌మండిలో 39.2°సెల్సియస్‌, పాటిగడ్డలో 39.1°సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37°C నుంచి 40°C మధ్య, కనిష్ట ఉష్ణోగ్రతలు 24°సెల్సియస్‌ మధ్యలో నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 36°C నుండి 38°C మధ్య, కనిష్ట ఉష్ణోగ్రతలు 23°C నుండి 25°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 38.8 డిగ్రీల సెల్సియస్‌, నల్గొండలోని గూడపూర్‌లో 40 డిగ్రీల సెల్సియస్‌, వనపర్తి జిల్లా చండూరు, పెబ్బాయిరులో 40.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ పేర్కొంది.

Also Read: Avoid Sugar : పంచదార తినడం పూర్తిగా మానేస్తే.. ఈ హెల్త్ బెనిఫిట్సన్నీ మీ సొంతం..