Site icon HashtagU Telugu

KTR : ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందే : కేటీఆర్

Ktr Brs Mlas

KTR : పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.  ఫిరాయింపులపై సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్నారు.  పార్టీ ఫిరాయింపులపై వచ్చే ఫిర్యాదులను 3 నెలల్లోగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. ఈ అంశంపై అసెంబ్లీ స్పీకర్‌కు వినతిపత్రం అందించిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సుప్రీం కోర్టు తీర్పును స్పీకర్‌కు చదివి వినిపించానని ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని ప్రస్తావించారని కేటీఆర్(KTR) గుర్తు చేశారు.

We’re now on WhatsApp. Click to Join

హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరితే ఇదే హస్తం పార్టీ కొట్లాడుతోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ రూ.50 కోట్లకు కొంటోందని సీఎం సిద్ధరామయ్య ఆరోపిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. హిమాచల్ రాజ్యసభ ఎన్నికలు, మహారాష్ట్ర పరిణామాలను స్పీకర్ గడ్డం ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.ఈ ఘటనలన్నీ దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల(BRS MLAs) సభ్యత్వాలను రద్దు చేయాలని స్పీకర్‌ను కోరినట్లు ఆయన వెల్లడించారు. నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు లేకుండా చూడాలని స్పీకర్‌ను కోరామన్నారు.

Also Read :Fixed Deposit: ఎఫ్‌డీల‌పై ప్ర‌ముఖ బ్యాంక్ స్పెషల్ మాన్‌సూన్ స్కీమ్..? వ‌డ్డీ ఎంతంటే..?

సబితా ఇంద్రారెడ్డి ఏమన్నారంటే.. 

అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పట్టించుకోకుండా.. ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులతో ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు.  నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థిని స్టేజీపై కూర్చొబెట్టారని ఆమె చెప్పారు. ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు పార్టీ  కండువాలు వేసుకొని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేల హక్కులను కాపాడాలని స్పీకర్‌ను కోరినట్లు సబిత్ తెలిపారు. ‘‘హుజూరాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, అసిఫాబాద్,  మహేశ్వరం వంటి అనేక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై  పోలీసులు కేసులు నమోదు చేస్తున్న దుర్మార్గమైన పరిస్థితి నెలకొంది’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read :BRS MLAs : స్పీకర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆ 14 మంది గైర్హాజరు ?