Site icon HashtagU Telugu

Chiranjeevi : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మెగాస్టార్ స్పెషల్ మీటింగ్..

Megastar Chiranjeevi Meets Telangana Deputy CM Mallu Bhatti Vikramarka

Megastar Chiranjeevi Meets Telangana Deputy CM Mallu Bhatti Vikramarka

తెలంగాణలో(Telangan) కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకుపోతుంది. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు మంత్రులు బిజీగా ఉంటున్నారు. ఇక పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులని కలిసి శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇటీవల బాలకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే.

తాజాగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుని(Mallu Bhatti Vikramarka) నేడు గురువారం రాత్రి ప్రజాభవన్ లో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), ఆయన సతీమణి సురేఖలు మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారిని కాశ్మీర్ నుంచి తెప్పించిన శాలువాతో చిరంజీవి సత్కరించారు. అనంతరం చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి భట్టి విక్రమార్క సత్కారం చేశారు. ఈ సమావేశంలో మంత్రి భట్టి సతీమణి మల్లు నందిని విక్రమార్క, కుమారుడు సూర్య విక్రమాదిత్య కూడా పాల్గొన్నారు.

 

దీంతో చిరంజీవి – భట్టి విక్రమార్క కలయిక రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. గతంలో చిరంజీవి కాంగ్రెస్ లో ఉన్న సంగతి తెలిసిందే. అప్పటి నాయకులు అంతా ఇప్పుడు మళ్ళీ మంత్రులు అవ్వడంతో చిరంజీవి తన పాత స్నేహాలని బయటకి తీస్తున్నారా? సీఎం రేవంత్ ని కూడా కలుస్తారా అని చర్చలు జరుగుతున్నాయి. మరో వైపు చిరంజీవి మీటింగ్ అటు ఏపీలోను చర్చగా మారింది. ఇవాళే షర్మిల కాంగ్రెస్ లో కూడా చేరింది. త్వరలో ఏపీ కాంగ్రెస్ ని నడిపిస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 

Also Read : Kishan Reddy: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే చెత్తలో వేసినట్లే: కిషన్ రెడ్డి